తెలంగాణ

telangana

మంచి నీళ్ల కన్నా చౌకగా ముడి చమురు!

By

Published : Mar 9, 2020, 6:32 PM IST

Updated : Mar 9, 2020, 7:06 PM IST

సౌదీ, రష్యా విభేదాల నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు మంచి నీళ్ల కన్నా చౌకగా లభిస్తోంది. మన కరెన్సీలో లెక్కగడితే లీటర్ క్రూడాయిల్​ రూ.16కే వస్తోంది.

oil
ముడి చమురు

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా, ఒపెక్ దేశాల మధ్య భేదాలతో క్రూడ్​ ధరలు 30 శాతం పతనమయ్యాయి. ఫలితంగా బ్యారెల్ చమురు ధర 36 డాలర్ల(రూ.2,660)కు పడిపోయింది.

ఒక బ్యారెల్​ పరిమాణం 159 లీటర్లు. ముడి చమురు ధర లీటర్​కు రూ.16కే వస్తోందన్నమాట. అంటే మినరల్ వాటర్ బాటిల్ ధర(రూ.20)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

రష్యా, సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు ఉత్పత్తుల విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను తగ్గించింది(30 శాతానికి పైగా) సౌదీ.

దేశంలో ఇలా..

అయితే భారత్​లో మాత్రం చమురు ధరలు నేడు స్వల్పంగానే తగ్గాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 24 పైసలు క్షీణించి రూ.70.59కు చేరుకుంది. డీజిల్​పై 27 పైసలను తగ్గిన ధర రూ.63.26కు దిగొచ్చింది.

ఇదీ చూడండి:అరేబియాలో చమురు యుద్ధం.. భారత్​కు లాభమేనా?

Last Updated :Mar 9, 2020, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details