తెలంగాణ

telangana

వైద్య బీమా పాలసీలకు రంగులు

By

Published : Oct 8, 2020, 5:47 AM IST

ఆరోగ్య బీమా పాలసీలు సులువుగా అర్థమయ్యేలా వాటికి రంగుల కోడ్​ ఇవ్వాలని ఐఆర్​డీఏఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే విడుదల చేసింది. పాలసీలకు ఏ రంగు ఇచ్చారనేది ఆయా బీమా సంస్థల వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

colors for health insurance policies
వైద్య బీమా పాలసీలకు రంగులు

ఆరోగ్య బీమా పాలసీదారులకు పాలసీలు సులువుగా అర్థం అయ్యేందుకు వీలుగా వాటికి రంగుల (ఆకుపచ్చ, నారింజ, ఎరుపు) కోడ్‌ను ఇచ్చేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ముసాయిదా రూపొందించి, విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆకుపచ్చ రంగున్న పాలసీలు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అర్థం. నారింజరంగు ఉన్నవి కాస్త మధ్యస్థంగా ఉండేవి. ఎరుపు రంగు కోడ్‌ ఉన్నవాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఎంపిక చేసుకోవాలి. పాలసీలకు ఏ రంగు ఇచ్చారనేది ఆయా బీమా సంస్థల వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.

అక్టోబరు 15 లోగా ఈ ముసాయిదాపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించింది. వీటిని పరిశీలించాక నియంత్రణ సంస్థ తుది మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details