తెలంగాణ

telangana

High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు అధికారులకు జైలుశిక్ష

By

Published : May 4, 2023, 7:07 PM IST

Updated : May 4, 2023, 8:38 PM IST

High Court
High Court

18:59 May 04

ఈనెల 2వ తేదీన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

Five officers sentenced to jail: కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ సహా ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ ఈనెల 2వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్‌టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటుగా... మరో ముగ్గురు అధికారులకు సైతం నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటుగా ఐదుగురు అధికారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. గతంలో ఆర్టీసీ ఫీల్డ్‌మెన్లను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఫీల్డ్‌మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విరి పిటిషన్ విచారించిన హైకోర్టు అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈనెల 16లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 4, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details