తెలంగాణ

telangana

Zika virus: కేరళలో జికా వైరస్‌ కలకలం!

By

Published : Jul 8, 2021, 9:58 PM IST

కరోనాతో దేశం అల్లాడుతున్న సమయంలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో తొలిసారి జికా వైరస్(Zika virus)​ కేసులు బయటపడ్డాయి. 19 నమూనాలను పరీక్షలకు పంపగా.. 12 మందికి పాజిటివ్ అని తేలింది.

kerala zika virus
జికా వైరస్ కేసు కేరళ

ఓ వైపు కరోనా వైరస్‌ మహమ్మారితో దేశం సతమతమవుతుండగా.. కేరళలో తొలిసారి జికా వైరస్‌(Zika virus) కేసులు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్‌ కేసులు తాజాగా నమోదయ్యాయి. పుణెలోని నేషనల్‌ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 12 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. అంతకుముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్‌ తొలిసారి వెలుగు చూసింది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. బిడ్డలో వైరస్‌ లక్షణాలు లేనందున ఊపిరి పీల్చుకున్నారు.

జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: చేపలమ్మే చిన్నారులకు ఫ్రీగా ఇల్లు!

ABOUT THE AUTHOR

...view details