తెలంగాణ

telangana

రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: షర్మిల

By

Published : Mar 8, 2023, 1:07 PM IST

Updated : Mar 8, 2023, 1:40 PM IST

YS Sharmila arrested in Hyderabad మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా షర్మిల... హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న మౌన దీక్షను... పోలీసులు భగ్నం చేశారు. అనంతరం షర్మిలను అరెస్టు చేసి... బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

YSRTP president YS Sharmila arrested in hyderabad
YSRTP president YS Sharmila arrested in hyderabad

YS Sharmila arrested in hyderabad రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి... నోటికి నల్ల రిబ్బెన్లు కట్టుకుని వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు.

YS Sharmila Comments on Cm kcr ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు అయిందన్న షర్మిల... ఒక్క కవితకు తప్ప ఎవరికి రక్షణ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో.. మహిళల కిడ్నాప్ విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 20వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని విమర్శించారు.

YS Sharmila Fires on BRS govt మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ముఖ్య మంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆడవాళ్ల పట్ల వివక్ష ఉందని ఆమె ఆరోపించారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ ఎక్కడ అమలవుతుందో చూపాలని ధ్వజమెత్తారు. ఏకంగా గవర్నర్‌నే అసభ్య పద జాలంతో దూషించారని షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళలకు రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'' మహిళలపై జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా దీక్ష చేస్తుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు అసలు భద్రతా ఉందా అని ప్రశ్నిస్తున్నా... మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ముఖ్య మంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుమార్తె కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు. కేసీఆర్‌కు ఆడవాళ్ల పట్ల వివక్ష ఉంది. మహిళలకు రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయింది. '' - వైఎస్. షర్మిల, వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు.

YS Sharmila tweet on kcr ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే మహిళలు యాదికొచ్చారని వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి... మూడేండ్లుగా దాదాపు 4వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కేసీఆర్ మోసం చేశారని ట్వీట్ చేశారు.

ఇప్పుడు పట్టుమని 750కోట్లు ఇచ్చి.. మహిళల పట్ల మరోసారి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ తీరుతో మహిళలే ఆపసోపాలు పడి, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మహిళల పట్ల కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే పూర్తిగా 4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 750 కోట్లకు కేటీఆర్ కృతజ్ఞత చెప్పడం మానేసి... కేసీఆర్ వద్ద బకాయిలు వసూలు చేయించాలని సూచించారు.

ఇవీ చూడండి:

Last Updated :Mar 8, 2023, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details