తెలంగాణ

telangana

Youth died after car explodes : భారీ శబ్దంతో కారులో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం.. వాహనం దగ్ధం

By

Published : Aug 7, 2023, 3:26 PM IST

Youth Died After Car Explodes in Kerala : కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

Youth died after car explodes in Kerala
Youth died after car explodes in Kerala

Youth Died After Car Explodes in Kerala : కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగడం వల్ల ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన కేరళలో సోమవారం అర్థరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది.
రాష్ట్రంలోని మావెలిక్కర ప్రాంతానికి చెందిన కృష్ట ప్రకాశ్(35).. తన కారును ఇంటి గేటు లోపల పార్క్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం బయటకు వెళ్లిన ప్రకాశ్.. తిరిగి వస్తుండగా ఇంటి గేటు దగ్గరకు రాగానే పెద్ద శబ్దంతో కారులో పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. కారులో ఆకస్మాత్తుగా మంటలు రావటం వల్ల ప్రకాశ్ బయటకు రాలేకపోయాడు. ఫలితంగా వాహనంలోనే తుదిశ్వాస విడిచాడు. కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"మాకు అందిన సమాచారం ప్రకారం కృష్ట ప్రకాశ్ ఇంటి గేటు దగ్గరకు వచ్చినప్పుడు కారు ఒక్కసారిగా పేలిపోయింది. మంటల కారణంగా ఆ సమయంలో కారులో నుంచి బయటకు కృష్ట రాలేకపోయాడు" అని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్షల తరవాతే కారులో పేలుడుకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

కారులో మంటలు..గర్భిణీ మృతి
ఫిబ్రవరిలో ఇదే తరహా ఘటన కేరళలో జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కన్నూర్ జిల్లాలో కారులో మంటలు చెలరేగటం వల్ల ఓ గర్భిణీ, ఆమె భర్త మృతి చెందారు. ఫిబ్రవరి 2న గర్భిణీ కారులో ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో మెుత్తం ఆరుగురు ఉన్నారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. కుట్టియత్తూరు కరారంబుకు చెందిన ప్రజిత్(32), అతని భార్య రీషా(26) ఇంటి నుంచి కన్నూర్ జిల్లా ఆసుపత్రికి కారులో వెళ్తున్నారు. వీరితో పాటు రీషా తల్లిదండ్రులు కుజిక్కల్ విశ్వనాథన్, శోభ, అత్త సజినా, శివపార్వతి ఉన్నారు. వీరు కారు వెనక సీటులో కూర్చున్నారు. కారులో మంటలు చెలరేగినప్పుడు బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. రీషా దంపతులు కారు ముందుభాగంలో ఉన్నారు. మంటలు చెలరేగిన సమయంలో తప్పించులేక కారులో సజీవదహనం అయ్యారు.

Moving Car Catches Fire in Hyderabad : కదులుతున్న కారులో చెలరేగిన మంటలు.. చూస్తుండగానే..!

Maharashtra Bus Accident : 'టైర్​ పేలలేదు.. బస్సు వేగంగా నడపలేదు'.. రోడ్డు ప్రమాదంపై ఆర్​టీఓ నివేదిక

ABOUT THE AUTHOR

...view details