తెలంగాణ

telangana

బంప్​ లేకుండానే ఇద్దరు పుట్టారు.. ఎలా?

By

Published : Jul 22, 2021, 9:08 PM IST

Updated : Jul 22, 2021, 9:14 PM IST

గర్భం.. ఓ మహిళను తెగ వైరల్​ చేసింది. నెటిజన్లను ఆశ్చర్యంలోకి నెట్టేసింది. పొట్ట లేకుండానే ఇద్దరు పిల్లలెలా పుట్టారనే ప్రశ్నను రేకెత్తించే పోస్టే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..

pregnant
ప్రెగ్నెన్సీ, చిన్న గర్భం

సహజంగా గర్భిణులకు పొట్ట ఉబ్బుగా కనిపిస్తుంది. కొంత మంది శరీరాకృతి అయితే పూర్తిగా మారిపోతుంది. కానీ కవలలకు జన్మనిచ్చిన ఓ మహిళ 'బేబీ బంప్​' చూసి అందరూ షాక్​ అవుతున్నారు.

ఇదీ జరిగింది..

రెబెకా హర్లీ అనే మహిళ.. ఆమె గర్భంతో ఉన్నప్పటి ఫొటోలను ఇన్​స్టా వేదికగా షేర్​ చేశారు. ఆ సమయంలో పొట్ట చిన్నగా ఉన్నప్పటికీ కవలలకు జన్మనిచ్చినట్లు తెలుపుతూ ఈ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా సాధ్యమేనా? అని కామెంట్లు చేస్తున్నారు.

ప్రెగ్నెన్సీ సమయం ముగిసే నాటికి కూడా కడుపు చిన్నగానే ఉందని హర్లీ చెప్పుకొచ్చారు. 'ముందు భాగం నుంచి చూసినా, వెనక భాగం నుంచి చూసినా కడుపు చిన్నగానే కనిపించింది. ఇది మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది' అని పోస్ట్​ చేసిన వీడియోలో చెప్పారు హర్లీ.

గర్భం చిన్నగానే ఉన్నా..
కవలలకు జన్మనిచ్చిన మహిళ

మరో వీడియోలో హర్లీ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. గడువుకన్నా 5 వారాల ముందే కవలలు పుట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదుగురు బిడ్డలకు తల్లి. కవలలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:యజమాని కుటుంబం కోసం తాచుపాముతో పిల్లి ఫైట్

Last Updated :Jul 22, 2021, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details