తెలంగాణ

telangana

20 రోజుల క్రితమే ప్రసవం.. కట్నం కోసం ఇంట్లో నుంచి తరిమేసిన భర్త.. 3 రోజులుగా బస్టాండ్​లోనే..

By

Published : Jan 24, 2023, 8:19 PM IST

woman with an infant was in distress at the bus stand three days.. dowry cruelty in TN

కట్నం కోసం.. 20 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు అత్తింటివారు. మరింత కట్నం తేవాలంటూ ఇంట్లో నుంచి తరిమేశారు. దీంతో అభాగ్యురాలు బస్టాండ్​లోనే తలదాచుకుంది. తమిళనాడులో ఈ దారుణం జరిగింది.

20 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళపై భర్తతో సహా అత్తింటివారు దారుణంగా ప్రవర్తించారు. కట్నం కోసం ఆమెను ఇంట్లో నుంచి తరిమేశారు. దీంతో 20 రోజుల వయస్సున్న పసికందుతో బస్టాండ్​లోనే తలదాచుకుంది ఆ అభాగ్యురాలు. దిక్కుతోచని స్థితిలో తన ఇద్దరు కొడుకులతో మూడు రోజులుగా బస్టాండ్​లోనే ఉంది. తీవ్ర శోకంతో ఉన్న ఆమెను గమనించిన స్థానికులు.. డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ.. మహిళ కానిస్టేబుల్​ బృందాన్ని అక్కడికి పంపించారు. అనంతరం ఆమెను పోలీసుల స్టేషన్​కు తీసుకెళ్లారు. తమిళనాడులో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పేరు గీత. భర్త ప్రశాంత్​. వీరిది ధర్మపురి జిల్లా. హరూర్ సమీపంలోని కీరపట్టి గ్రామంలో నివాసం ఉంటున్నారు. అత్తమామలు గీతను కట్నం కోసం తీవ్రంగా హింసించారు. ఆమెపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆ మహిళ తన ఇద్దరు కొడుకులతో హరూర్​ బస్టాండ్​లోనే తలదాచుకుంది. స్థానికులే ఆమెకు ఆహారాన్ని అందించారు.

చిన్నారులతో బాధితురాలు గీత

"నా భర్త, మిగతా కుటుంబ సభ్యులు కట్నం కోసం నన్ను హింసిస్తున్నారు. రెండేళ్ల క్రితమే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో వారు సరిగ్గా చర్యలు తీసుకోలేదు. అనంతరం నన్ను మా పుట్టింటికి పంపించారు. కొద్ది నెలల క్రితమే నేను నా భర్త వద్దకు వచ్చాను. 20 రోజుల క్రితమే నాకు బాబు పుట్టాడు. అయినా కట్నం కోసం వేధిస్తూ.. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు." అని బాధితురాలు గీత వాపోయింది.
గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నాం. కట్నం విషయం నిజమని తేలితే నిందితులపై చర్యలు తీసుకుంటామని హరూర్ డీఎస్పీ పుగలేంటి గణేష్ తెలిపారు.

బైక్​ షోరూంలో అగ్ని ప్రమాదం.. 100 బైకులు..
గుజరాత్​లోని ఓ బైక్​ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు 100 బైకులు కాలిపోయాయి. సోమవారం ఈ ప్రమాదం జరగ్గా.. ఘటనలో కొన్ని బైక్​లతో సహా మరికొంత సామగ్రి కాలి బూడిదయ్యాయి. మహినగర్​ జిల్లాలోని సంత్రంపుర్​లో ఈ ఘటన జరిగింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఎటువంటి ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారు. అప్పటికే షోరూం చాలా వరకు అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ తరువాత అసలేం జరిగిందో తెలుస్తుందని అధికారులు తెలిపారు. "ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదం జరిగినప్పుడు షోరూంలో 100 బైక్​లు ఉన్నాయి. దాదాపు రూ.1.5 నుంచి రూ.2 కోట్ల నష్టం జరిగింది." అని నిర్వాహకులు తెలిపారు.

రెండు చేతువెళ్లు నరికి మరి వ్యక్తి దారుణ హత్య:
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. మృతుడిని గుర్తుపట్టడానికి వీలు లేనంతగా హత్య చేశారు. అతని రెండు చేతి వేళ్లన్ని నరికేశారు. బెంగళూరు శివారు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవనహళ్లిలోని విజయపుర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ దారుణం జరిగింది. నిర్మానుష ప్రదేశంలో ఓ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. అనంతరం అక్కడికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరికేసి ఉన్న చేతి వేళ్ల ఆధారంగానే.. మృతుడిని ముత్యారప్పగా గుర్తించారు. విచారణ అనంతరం ఆంద్రప్రదేశ్, అనంతపురం జిల్లాకు చెందిన నగేష్, సమశేఖర్​ను నిందితులుగా గుర్తించి అరెస్ట్​ చేశారు. "ముత్యారప్పకు, నగేశ్​కు మధ్య కొద్ది రోజులు క్రితం చిన్న గొడవ జరిగింది. దీంతో ముత్యారప్పను నగేశ్​ చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం జనవరి 1న శేఖర్​తో కలిసి హత్య చేశాడు." అని పోలీసులు తెలిపారు.

కాలేజీ హాస్టల్​ హౌజ్​ కీపర్ ర్యాగింగ్​.. విద్యార్థి ఆత్మహత్య:
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ర్యాగింగ్​ కారణంగానే విద్యార్థి చనిపోయినట్లు తెలుస్తోంది. జనవరి 18న లోనార్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని కైలాస్ గైక్వాడ్​గా పోలీసులు గుర్తించారు. లోనార్‌లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కైలాస్ విద్యార్థిగా ఉన్నాడు. కాలేజీ హాస్టల్​ హౌజ్​ కీపర్ విద్యార్థిని ర్యాగింగ్​ చేశాడు. కాలేజీ టీచర్​ తోటి సహచరుల ముందు కైలాస్​ను తిట్టాడు. దీంతో అవమాన భారంతో కైలాస్​ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details