తెలంగాణ

telangana

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!

By

Published : May 15, 2022, 10:48 AM IST

Updated : May 15, 2022, 11:38 AM IST

when calf start giving milk
పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు! ()

ఆ ఆవుదూడ వయసు 11 నెలలే. ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజుకు మూడున్నర లీటర్లు పాలు ఇస్తోంది. ఎక్కడ? ఎలా సాధ్యం?

నెలల

గర్భం దాల్చకుండానే పాలు ఇస్తున్న ఓ ఆవు దూడ.. కేరళ కన్నూర్​ జిల్లాలో చర్చనీయాంశమైంది. కంగోల్​కు చెందిన సజేశ్​.. 11 నెలల వయసున్న ఈ దూడకు యజమాని. 2021లో ఆవును, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్​ సోకగా.. దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుతున్నాడు.

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!

కొద్దిరోజుల క్రితం ఈ దూడ పొదుగు ఉబ్బిఉండడాన్ని గమనించింది సజేశ్​ పొరుగింటి మహిళ. విషయాన్ని యజమానికి చెప్పింది. సజేశ్ పరిశీలించి చూడగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు మంచి మేత వేస్తూ.. కొన్నిరోజుల తర్వాత మరోసారి పాలు పితికి చూశాడు సజేశ్. ఈసారి చిక్కటి పాలు వచ్చాయి.

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!

గత 15 రోజులుగా.. నిత్యం రెండు విడతల్లో ఆ దూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. అనుమానంతో వాటిని సజేశ్ పరీక్ష చేయించాడు. వాటితో ఏ ఇబ్బందీ లేదని తేలింది. దూడ ఇస్తున్న పాలలో 8.8శాతం వరకు కొవ్వు ఉంటున్నట్లు వెల్లడైంది. అరుదైన సందర్భాల్లో హార్మోన్లలో తేడా కారణంగానే ఇలానే జరుగుతుందని వైద్యులు సజేశ్​కు చెప్పారు.

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!
Last Updated :May 15, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details