తెలంగాణ

telangana

VIP Darshan in Tirumala for those who Wrote Govinda Koti: యువతలో భక్తిభావం పెంచేలా 'గోవింద కోటి'.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 8:13 PM IST

VIP Darshan in Tirumala for those who Wrote Govinda Koti : యువతలో భక్తి భావం పెంపొందించడంతో పాటు సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా తితిదే ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 25 ఏళ్లలోపు వయసున్న యువతీయువకులు గోవింద కోటి రాస్తే వారి కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం, 10లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి ప్రత్యేక ప్రవేశం కల్పిస్తామని తితిదే ఛైర్మన్‌ తెలిపారు.

VIP_Darshan_in_Tirumala_Write_Govinda_Koti
VIP_Darshan_in_Tirumala_Write_Govinda_Koti

VIP Darshan in Tirumala for those who Wrote Govinda Koti: గోవింద కోటి రాస్తే వీఐపీ దర్శనం.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

VIP Darshan in Tirumala for those who wrote Govinda Koti: రామకోటి తరహాలో గోవింద కోటి నామాలు రాసేలా యువతను ప్రోత్సహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. గీతాసారంతో కూడిన కోటి పుస్తకాలను కేజీ నుంచి పీజీ విద్యార్థులకు అందజేయాలని తితిదే ధర్మకర్తల మండలినిర్ణయించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న రెండు, మూడు గోవిందరాజస్వామి సత్రాలను తొలగించి... 600కోట్ల రూపాయలతో ఆధునిక వసతి సముదాయాలను నిర్మించడానికి... ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్​.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ​..!

TTD Board Key Decisions: సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడం హిందూ భావజాలాన్ని యువతలో పెంపొందించడమే లక్ష్యంగా తితిదే ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. యువతలో భక్తిభావం పెంచేలా 25 ఏళ్లలోపు వయసున్నయువతీయువకులను గోవింద కోటి రాసేలా ప్రోత్సహించాలనినిర్ణయం తీసుకున్నారు. గోవింద కోటి రాసిన యువకులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 10లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతిస్తామన్నారు.

TTD Varalakshmi Vratham Tickets : తిరుమలలో వరలక్ష్మీ వ్రతం.. టికెట్లు విడుదల.. బుక్​ చేసుకోండిలా

Tirumala Brahmotsavam: అధికమాసం రావడంతో ఈఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనునన్నందున.. భక్తుల దర్శనాలు, వసతి సౌకర్యాలపై సమావేశంలో చర్చించామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. వసతి సముదాయాల కొరత తీర్చడానికి తిరుపతిలో 600 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు చెప్పారు.

TTD Board New Members Appointed: టీటీడీ బోర్డు సభ్యుల నియామకం.. కృష్ణమూర్తికి నాలుగో సారి మళ్లీ ఛాన్స్‌

2కోట్ల రూపాయలతో చంద్రగిరి మూలస్థాన ఆలయ జీర్ణోద్ధరణ, 5 కోట్ల రూపాయలతో ముంబయి బాంద్రాలో తితిదే సమాచార కేంద్రం, కోటిన్నరతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు కరుణాకరరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో తితిదే ఉద్యోగుల క్వార్టర్స్‌ మరమ్మతుల కోసం 49.5 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.తిరుమల ఆలయ లడ్డు పోటులో413 మంది ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.

తిరుపతి గోవిందరాజ సత్రాలను తొలగించి, 600 కోట్ల రూపాయలతో కొత్త భవానలను నిర్మించాలని తితిదే నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో తొలిసారి సమావేశమైన పాలక మండలి... నూతన భవనాలకు అచ్యుతం, శ్రీపథం అనే పేర్లు పెట్టాలని తీర్మానించింది. బ్రహ్మోత్సవాల నిర్వహణ, పెరటాసి మాసంలో రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు... తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా 25 ఏళ్లలోపు వ్యక్తులు కోటి గోవింద నామాలు రాస్తే వీఐపీ దర్శన సదుపాయం, 10 లక్షల వెయ్యి 16 నామాలు రాసిన వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కరుణాకరరెడ్డి ఖండించారు.

TTD Tirumala Seva Tickets for November : తిరుమల శ్రీవారి సేవాటికెట్లు.. నేడే విడుదల!

ABOUT THE AUTHOR

...view details