తెలంగాణ

telangana

యూపీపై వరుణుడి పంజా.. 25 మంది బలి.. 12 జిల్లాల్లో స్కూల్స్​ బంద్

By

Published : Oct 10, 2022, 8:25 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం వరుణుడి బీభత్సం సృష్టించాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని స్తంభింపచేశాడు. జోరు వానల కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన దుర్ఘటనల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

up rain news 2022
యూపీపై వరుణుడి పంజా

Uttar Pradesh heavy rain news : ఉత్తర్​ప్రదేశ్​లో భారీ వర్షాల కారణంగా ఆదివారం 25 మంది మరణించారు. జోరు వానలతో రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల జరిగిన దుర్ఘటనల్లో వీరంతా ప్రాణాలు విడిచారు. కుండపోత వర్షాలతో లఖ్​నవూ, అలీగఢ్​, మేరఠ్, గౌతంబుద్ధ్ నగర్, గాజియాబాద్​ సహా మొత్తం 12 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక చోట్ల రహదారులు నీటమునిగాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా 12 జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు.

గోరఖ్​పుర్​లో పడవ మునక- జోరుగా సహాయక చర్యలు

అనేక కుటుంబాల్లో విషాదం

  • గోరఖ్​పుర్​లోని రప్తీ నదిలో పడవ మునిగి ఇద్దరు మరణించారు.
  • ఆదివారం ఉదయం 11 గంటలకు గాజియాబాద్​లో ఇల్లు కూలి 90 ఏళ్ల వృద్ధురాలి ప్రాణాలు కోల్పోయింది.
  • మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అకల్​పుర్​ గ్రామంలో ఇల్లు కూలి ఓ మహిళ మృతి చెందింది.
  • హర్దోయిలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. మరొకరు గాయపడ్డారు.
  • సీతాపుర్​ జిల్లా ఔత్రాలీ గ్రామంలో 11 ఏళ్ల బాలిక పిడుగుపాటు కారణంగా మరణించింది. ఇటావాలోని జౌన్​పుర్​లో 75ఏళ్ల మహిళ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయింది.
  • బులంద్​షహర్​లో ఇళ్లు కూలిన మూడు వేర్వేరు ఘటనల్లో 14 ఏళ్ల బాలుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.
  • బల్​రామ్​పుర్​లో వరదల్లో ఇద్దరు టీనేజర్లు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు.
  • ఇదే తరహాలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కూలిన ఇల్లు
యూపీలో భారీ వర్షాలు- జలమయమైన రోడ్లు
భారీ వర్షాలతో నేలకొరిగిన పంట

వీడని ముప్పు..
భారత వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​లో 22.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే రోజుకు సంబంధించిన దీర్ఘకాలిక సగటుతో పోల్చితే ఇదే 2,396శాతం అధికం. అక్టోబర్​ 1 నుంచి యూపీలో 92.3మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీర్ఘకాలిక సగటుతో పోల్చితే ఇది 500శాతం ఎక్కువ. రాష్ట్రంలో మరో రోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

యూపీలో భారీ వర్షాలు- జలమయమైన రోడ్లు
యూపీలో భారీ వర్షాలు- జలమయమైన రోడ్లు
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట
యూపీలో భారీ వర్షాలు- జలమయమైన రోడ్లు

ABOUT THE AUTHOR

...view details