తెలంగాణ

telangana

Lota Race: చెంబులు పట్టుకుని మహిళల పరుగో పరుగు

By

Published : Oct 13, 2021, 2:54 PM IST

Updated : Oct 13, 2021, 3:29 PM IST

lota daud
'లోటా దౌడ్' ()

ఇళ్లలో శౌచాలయాలు ఉన్నప్పటికీ.. చాలా మంది కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరు బయటకు వెళ్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో శౌచాలయాల వినియోగాన్ని(Open Defecation Free) ప్రోత్సహించేందుకుగాను మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో అధికారులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. 'లోటా దౌడ్' పేరుతో చెంబులో నీళ్లు పట్టుకుని పరిగెత్తే పోటీని నిర్వహించారు. ఇందులో 18 మంది మహిళలు పాల్గొన్నారు.

'లోటా దౌడ్​' పోటీలో పాల్గొన్న మహిళలు

బహిరంగ మలవిసర్జనకు(Open Defecation Free) వ్యతిరేకంగా మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో అధికారులు వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టారు. నీళ్ల చెంబును చేతుల్లో పట్టుకుని పరిగెత్తే పోటీని నిర్వహించారు. భోపాల్ జిల్లాలోని(Madhya Pradesh Bhopal News) ఫందా కలా గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. 'లోటా దౌడ్' పేరుతో ఈ పోటీని నిర్వహించారు.

'లోటా దౌడ్'​లో పరుగెత్తుతున్నమహిళలు
పోటీలో పాల్గొనేందుకు చేతులో చెంబుతో సిద్ధమైన మహిళలు

ఈ పోటీలో 18 మంది మహిళలు పాల్గొన్నారు. నీళ్ల చెంబును పట్టుకుని వారంతా పరిగెత్తారు. తమ కోడళ్లను బహిరంగ మల విసర్జన నుంచి దూరం చేసి, టాయిలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకుగాను(Open Defecation Free) వాళ్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శౌచాలయాలు లేకపోవడం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఇలా తెలియజేశారు.

"అంతకుముందు శౌచాలయాలు ఉండేవి కావు. అత్తమ్మలు మల విసర్జన కోసం పొలాల్లోకి వెళ్లేవారు. కానీ, ఇప్పుడు వారు తమ ఇళ్లలో టాయిలెట్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం నీళ్లు సరఫరా చేస్తోంది. అందుకే ఇప్పుడు వారంతా తమ కోడళ్లను శౌచాలయాన్ని వినియోగించాలని, గౌరవంతో జీవించాలని కోరుతున్నారు."

-వికాస్ మిశ్రా, భోపాల్ జిల్లా పంచాయతీ సీఈఓ

మహిళలంతో పోటీ పడి పరిగెత్తాక.. ఎవరి చెంబుల్లో ఎక్కువ నీళ్లు మిగిలి ఉంటాయో వారిని విజేతలుగా నిర్ణయించారు. రేస్ అయిన తర్వాత వారు తమ చేతుల్లోని చెంబులను పడేశారు. దాంతో గ్రామంలోని మహిళలు.. ఆరు బయట కాలకృత్యాలు వినియోగించవద్దనే సందేశం ఇచ్చారు.

పోటీలో గెలిచన మహిళలను సత్కరిస్తున్న అధికారులు
బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న గ్రామస్థులు

"మలవిసర్జన కోసం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బయటకు వెళ్లడం తప్ప మరో మార్గం లేని దుస్థితికి వ్యతిరేకంగా ఈ పోటీని నిర్వహించాం. దీని ద్వారా మొత్తం సమాజానికి సందేశాన్ని ఇస్తున్నాము" అని ప్రజాపతి అనే స్థానికుడు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కాలకృత్యాలకు వెళ్లిన బాలిక​పై హత్యాచారం!

ఇదీ చూడండి:ఇలా ఆరుబయటకు వెళ్లారో.. రేషన్​ కార్డ్​ రద్దే..!

Last Updated :Oct 13, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details