తెలంగాణ

telangana

Ujjwala Yojana Subsidy Hike : కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్​ సబ్సిడీ పెంపు.. ఎంతంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 3:36 PM IST

Updated : Oct 4, 2023, 5:02 PM IST

Ujjwala Yojana Subsidy Hike : ఉజ్వల యోజన గ్యాస్‌ సిలిండర్‌ రాయితీని రూ.300కు పెంచాలని నిర్ణయించింది కేంద్రం. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

lpg gas subsidy price hike
lpg gas subsidy price hike

Ujjwala Yojana Subsidy Hike : పేద మహిళలకు గుడ్​ న్యూస్​ చెప్పింది కేంద్రం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.200 రాయితీని రూ.300 చేసింది. ఈ మేరకు బుధవారం దిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు మంత్రి అనురాగ్ ఠాకూర్​. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్​ ధర రూ. 903 కాగా.. ఉజ్వల యోజన వినియోగదారులు రూ.703 చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్​ తీసుకున్న నిర్ణయంతో కేవలం రూ.603 చెల్లించనున్నారు.

పసుపు బోర్డు, కేంద్ర గిరిజన యూనివర్సిటీకి ఆమోదం
Turmeric Board Benefits : దీంతో పాటు తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి అనురాగ్ ఠాకూర్​. సమ్మక సారక్క పేరిట ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పసుపు బోర్డు వల్ల దేశంలో పసుపుపై అవగాహనతో పాటు ఉత్పత్తి పెరుగుదల, కొత్త మార్కెట్ల ఏర్పాటు, విదేశాలకు ఎగమతులు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం రూ.1,600 కోట్ల పసుపును విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని.. దానిని రూ.8,400 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

పసుపు నాణ్యతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించేలా ఈ బోర్డు చర్యలు తీసుకుంటుందని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ బోర్డు ఛైర్మన్​ను కేంద్రం నియమిస్తుందని.. ఆయుష్​, ఔషధ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమ శాఖలు సభ్యులుగా ఉంటాయని చెప్పింది. మూడు రాష్ట్రాల ప్రతినిధులు రోటేషన్​ పద్ధతిలో సభ్యులుగా కొనసాగుతారని.. పసుపుపై పరిశోధనలు చేసే సంస్థలు, రైతులు, ఎగుమతుదారులు, వాణిజ్య శాఖ నియమించే కార్యదర్శి సభ్యుడిగా ఉంటారని పేర్కొంది.

కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు ఆమోదం
మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్‌కు ఆదేశించినట్టు చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందని వివరించారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు.

Ujjwala Yojana Free Gas Cylinder : కేంద్రం శుభవార్త.. ఉచితంగా మరో 75 లక్షల వంట గ్యాస్​ కనెక్షన్లు

Union Cabinet Meeting : ప్రత్యేక సమావేశాల వేళ కేంద్ర కేబినెట్​ భేటీ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

Last Updated : Oct 4, 2023, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details