తెలంగాణ

telangana

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఇకపై మాతృభాషలోనూ పరీక్షలు.. ఇంగ్లిష్​ మీడియం అయినా..

By

Published : Apr 19, 2023, 3:32 PM IST

Updated : Apr 19, 2023, 9:26 PM IST

యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ) డిగ్రీ చదివే విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇక నుంచి తాము ఇంగ్లిష్​ మీడియంలో కోర్సు చదువుతున్నప్పటికీ పరీక్షలను మాతృభాషలో రాసేందుకు వీలును కల్పించింది. ఈ మేరకు దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచనలు జారీ చేసింది.

ugc advice to universities on mother tongue exams
మాతృభాషలో పరీక్షలు రాసేందుకు యూజీసీ గ్రీన్​సిగ్నల్​

డిగ్రీ విద్య అభ్యసించే విద్యార్థులకు శుభవార్త​ చెప్పింది యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ). ఇక నుంచి విద్యార్థి చదువుతున్న కోర్సు ఆంగ్ల మాధ్యమంలో ఉన్నప్పటికీ సదరు విద్యార్థి లేదా విద్యార్థిని స్థానిక భాష అంటే మాతృ భషలో పరీక్షలు రాసేందుకు అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఒక స్టూడెంట్​ తనకు నచ్చిన కోర్సును ఇంగ్లిష్ మీడియంలో తీసుకున్నా సరే వారి స్థానిక లేదా మాతృ భాషలో పరీక్షలు​ రాయాలనుకుంటే అనుమతివ్వాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించారు యూజీసీ ఛైర్మన్​ జగదీశ్​​ కుమార్​.

పాఠ్యపుస్తకాలను తయారు చేయడంలో మాతృ/స్థానిక భాషలలో బోధన, అభ్యాస ప్రక్రియను ప్రోత్సహించడంలో ఉన్నత విద్యా సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయని జగదీశ్​ కుమార్ పేర్కొన్నారు. స్థానిక భాషల్లో పరీక్షలు రాసే ప్రయత్నాలను బలోపేతం చేయడం, మాతృభాషలో పాఠ్యపుస్తకాలను రాయడం, ఇతర భాషల నుంచి ప్రామాణికంగా తీసుకునే పుస్తకాల రచనల అనువాదం సహా బోధనలో వీటి వినియోగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి యూనివర్సిటీ యాజమాన్యంపై ఉందని కమిషన్​ నొక్కి చెప్పింది.

ఆ రాష్ట్రంలో MBBS హిందీలోనే..!
ఓ విద్యార్థికి తనకు నచ్చిన భాషలోనే విద్యను అభ్యసించే విధంగా దేశంలోని విద్యా విధానంలో మార్పులు అవసరమని చాలా కాలంగా చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పలు ఉన్నత విద్య కోర్సులను ఆంగ్లంలోనే బోధిస్తున్నారు. దీంతో ఇంగ్లిష్​ అంటే భయపడే విద్యార్థులు మాతృ భాషలో చదువుకునే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్థానిక భాషలో విద్యను బోధిస్తే విద్యార్థులు మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నది పండితుల మాట. దీనికి కార్యరూపం కల్పించేందుకు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆంగ్లంలో ఉన్నత విద్యను చదవలేకపోతున్నారని.. దీంతో విద్యార్థులు ఆత్మన్యూనతకు గురవతున్నారన్న ప్రధాన కారణంపై దృష్టి సారించి సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం ఇంగ్లిష్​లో మాత్రమే అందుబాటులో ఉండే వైద్య విద్య (MBBS) పుస్తకాలను అక్కడి స్థానిక భాష అయిన హిందీలోకి అనువదించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వైద్య విద్యను హిందీలో బోధించి, పరీక్షలు కూడా అదే భాషలో రాసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. దీంతో ఆంగ్లం అంటే భయపడే కొందరు విద్యార్థులకు తమ మాతృ భాషలోనే చదివి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది మధ్యప్రదేశ్ సర్కార్​. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Apr 19, 2023, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details