తెలంగాణ

telangana

ఠాక్రేకు ఉపశమనం.. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం

By

Published : Jul 11, 2022, 11:17 AM IST

Updated : Jul 11, 2022, 12:10 PM IST

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. శివసేన ఠాక్రే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై దాఖలు చేసిన పిటిషన్​పై స్పందించిన సుప్రీం.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు, ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి అబు సలేం కేసుపైనా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Etv Bharat
Etv Bharat

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న పిటిషన్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే, పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. వ్యాజ్యాలన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తామని తెలిపింది. కొత్త స్పీకర్ ప్రస్తుతానికి ఏ ఒక్క ఎమ్మెల్యేపైనా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 'ఈ కేసుకు సంబంధించి బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తాం. కొత్త బెంచ్​ ఎప్పుడు ఏర్పాటు అవుతుందో ఇప్పుడే చెప్పలేం' అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

అబు సలేం కేసుపైనా:
మరోవైపు, 1993 ముంబయి పేలుళ్ల సూత్రధారి అబు సలేంను పోర్చుగల్​కు అప్పగించే విషయమై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. 25ఏళ్ల జైలు శిక్ష పూర్తైన తర్వాత అతడిని పోర్చుగల్​కు అప్పగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది.

2002లో పోర్చుగల్​కు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అబు సలేంకు 25 ఏళ్లకు మించి శిక్ష వేయమని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌ల ధర్మాసనం తెలిపింది. ఈ హామీ ఆధారంగా తన జీవితఖైదు శిక్షను సవాలు చేస్తూ అబూసలేం దాఖలు చేసిన పిటిషనుపై సుప్రీం తాజా తీర్పును వెలువరించింది.

ఇవీ చదవండి:పన్నీర్​సెల్వంకు షాక్.. ఏడీఎంకేలో ఆ పోస్టులు రద్దు.. పళనిస్వామికే పగ్గాలు

దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్​తో..

Last Updated : Jul 11, 2022, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details