తెలంగాణ

telangana

టీఎంసీ నేతల దారుణ హత్య.. రక్తపు మడుగులో ముగ్గురు!

By

Published : Jul 7, 2022, 8:08 PM IST

Trinamool Leaders Shot Dead: ముగ్గురు తృణమూల్​ కాంగ్రెస్​ నాయకుల్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన బంగాల్​ గోపాల్​పుర్​ సమీపంలోని ధర్మతలా గ్రామంలో జరిగింది. రోడ్డు పక్కన రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు పోలీసులు.

Trinamool leaders shot dead in West Bengal's Canning
Trinamool leaders shot dead in West Bengal's Canning

Trinamool Leaders Shot Dead: బంగాల్​లో దారుణం జరిగింది. ముగ్గురు తృణమూల్​ కాంగ్రెస్​ నాయకుల్ని హత్య చేశారు దుండగులు. దక్షిణ 24 పరగణాలు జిల్లా గోపాల్​పుర్​ గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మృతుల్ని ధర్మతలా గ్రామ పంచాయతీ సభ్యులు స్వపన్​ మాఝీ(38), భూత్​నాథ్​ ప్రామాణిక్​(33), ఝాంతు హల్దార్​గా (33) గుర్తించారు.

ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి షాకయ్యారు. పియర్​ పార్క్ రోడ్డు​ సమీపంలో హత్య చేసి దుండగులు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. బైక్​లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలంలో బాంబ్​ షెల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల వెనుక భాజపా ఉందని ఆరోపించారు స్థానిక తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే పరేశ్​ రామ్​ దాస్​.

ABOUT THE AUTHOR

...view details