తెలంగాణ

telangana

Tragedy: ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి.. ఉరేసుకుని మెడికో ఆత్మహత్య

By

Published : Jul 2, 2023, 12:50 PM IST

Updated : Jul 2, 2023, 2:15 PM IST

mother and child suicide
mother and child suicide

12:43 July 02

బాలికల మృతదేహాలు లభ్యం

Mother suicide with Two Children: ఇద్దరు కుమార్తెలతో చెరువులోకి దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో సుకన్య అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలు దేవయాని(8), జస్మిత(6) లను ముదిగుబ్బ వద్ద చెరువులో నీటిలోకి విసిరేసి.. తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువులోకి పిల్లలను విసురుతున్న దృశ్యాన్ని స్థానికులు గమనించి.. అక్కడికి పరుగు తీసే సమయానికే ఇద్దరు పిల్లలను చెరువులో పడేసి సుకన్య దూకి ఆత్మహత్య చేసుకుంది. రైతులు చెరువులో దూకి ఇద్దరు పిల్లలను వెలికి తీశారు అప్పటికే వారు మృతి చెందారు. సుకన్య మృతదేహాన్ని బయటకు తీశారు. తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. ముదిగుబ్బ టీచర్స్ కాలనీలో నివాసముంటున్న గంగాధర్​కు.. భార్య సుకన్యకు తరచూ గొడవలు జరుగుతుండేవని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఈ దశలో ఆదివారం ఉదయాన్నే భర్తతో గొడవపడి చెరువు వద్దకు వెళ్లి.. తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. భర్త గంగాధర్​ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Medico Suicide: నెల్లూరు చింతా రెడ్డిపాలెoలోని నారాయణ మెడికల్ కాలేజీలో చైతన్య అనే మెడికో ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ రూమ్​లో విద్యార్థిని ఫ్యాన్​కు ఉరేసుకుంది. చైతన్య.. నారాయణ మెడికల్​ కాలేజిలో హౌస్ సర్జన్ చేస్తున్నారు. చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస. రెండు నెలల క్రితమే విజయనగరం మెడికల్ కళాశాలలో పీజీ చేస్తున్న యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. రాత్రి ఫోన్​లో మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతికి కుటుంబ కలహాలే కారణంగా అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 2, 2023, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details