తెలంగాణ

telangana

ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళకు నిప్పంటించి హత్య.. ఏం జరిగింది?

By

Published : Jan 11, 2023, 10:30 AM IST

Updated : Jan 11, 2023, 11:07 AM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు దారుణానికి తెగబడ్డారు. ఆమెకు నిప్పు అంటించి హత్య చేశారు. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది. మరోవైపు, గన్​తో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దిల్లీలో వెలుగుచూసింది.

Etv thieves-set-woman-on-fire-and-killed-in-karnataka
కర్ణాటకలో మహిళకు నిప్పు అంటించి చంపేసిన దుండగులు

కర్ణాటకలో దారుణం జరిగింది. మహిళకు నిప్పు అంటించి చంపేశారు దుండగులు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మారసింగనహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రేమ.. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెకు దుండగులు నిప్పంటించారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. "మృతిరాలి భర్త చనిపోయారు. ఆమె కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ప్రేమ ఒక్కరే ఇంటి వద్ద ఉంటూ.. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దుండగుల చేతుల్లో హత్యకు గురైంది." అని పోలీసులు తెలిపారు. ప్రేమ మృతదేహం పూర్తిగా కాలిపోయిందని పోలీసులు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వారు పేర్కొన్నారు. ఘటనాస్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గన్​తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య..
సీఐఎస్ఎఫ్ జవాన్.. గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దిల్లీలో జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధుల్లో ఉన్న జవాన్​.. వాష్​రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంతో పాటు అతడి పక్కన పడి ఉన్న సర్వీస్​ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ సైతం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

పోలీస్​కు జీవిత ఖైదు..
ఐదేళ్ల కుమార్తెతో పాటు భార్యను హత్య చేసిన కేసులో.. ఓ పోలీసు ఉద్యోగికి కోర్టు జీవిత ఖైదు విధించింది. గుజరాత్​ ఆరావళి కోర్టు మంగళవారం ఈ శిక్ష విధించింది.
కేసు వివరాల్లోకి వెళితే..పదేళ్ల క్రితం అర్వింద్ తన భార్య, ఐదేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం వారిద్దరిని 21 ముక్కలుగా నరికి ఓ బావిలో పడేశాడు. కొద్ది రోజుల తరువాత బావిలో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బావిలో నుంచి శరీర భాగాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం అర్వింద్​ను నిందితుడిగా తేల్చారు. కేసుపై వాదనలు విన్న కోర్టు.. నిందితుడికి జీవిత ఖైదు విధించింది.

Last Updated : Jan 11, 2023, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details