తెలంగాణ

telangana

భారీగా యుద్ధ విమానాల కొనుగోలు- రూ.2.23 లక్షల కోట్ల డీల్​కు రక్షణ శాఖ ఆమోదం- ఇక శత్రుదేశాలకు చుక్కలే!

By PTI

Published : Nov 30, 2023, 9:44 PM IST

Updated : Nov 30, 2023, 10:03 PM IST

Tejas Aircraft India : భారత్​ సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.23 లక్షల కోట్ల విలువ గల తేజస్​ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.

Tejas Aircraft India
Tejas Aircraft India

Tejas Aircraft India : భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్​ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్​గ్రేడ్​ ప్రోగ్రామ్​కు కూడా ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్‌ కౌన్సిల్(డీఏసీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలింది.

ఈ రెండు రకాల విమానాలను 98 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. అయితే తేజస్​ మార్క్-1ఏ యుద్ధ విమానాలు వాయుసేన కోసం.. 156 హెలికాప్టర్లను వాయుసేన, ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్).. సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్​గ్రేడ్​ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

2021లో రక్షణశాఖ.. వైమానిక దళం కోసం 83 తేజస్​ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్​ యుద్ధ విమానాలు సంఖ్య 180 కు చేరుకోనుంది.

" 97 తేజస్​ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం పొందడం నిజంగా ఒక అద్భుతమై విషయం. గతంలో కొనుగోలు చేసిన 83 యుద్ధ విమానాలు తర్వలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 40 తేలికపాటి యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఒప్పందంతో భారతీయ వైమానిక దళం బలం 220 లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు పెరుగుతుంది. ఇది వైమానిక దళానికి చెందిన దాదాపు పది స్క్వాడ్రన్‌లను సన్నద్ధం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం సంతోషంగా ఉంది."
-ఎయిర్​ స్టాఫ్​ చీఫ్ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ వీఆర్​ చౌదరి

'తేజస్‌' తేలికపాటి యుద్ధవిమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్) ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని రూపొందించింది. యాక్టివ్‌ ఎలక్ట్రానిక్- స్కాన్డ్ అర్రే రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ తదితర సామర్థ్యాలు దీని సొంతం. 'ప్రచండ్‌'నూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ఈ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్‌ను గత సంవత్సరం వాయుసేన, సైన్యంలోకి చేర్చారు. 21 వేల అడుగుల ఎత్తులోనూ సేవలు అందించగలదు. సియాచిన్‌, లద్ధాఖ్‌, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్‌'లో విహరించారు.

మరో 100 యుద్ధ విమానాలకు వాయిసేన ఆర్డర్​! రూ.66వేల కోట్లతో డీల్.. శత్రుదేశాలకు చుక్కలే!

Sukhoi 30 Mki India : స్వదేశీ మంత్రంతో భారత్​.. సుఖోయ్‌లు.. సర్వే నౌకలు.. రూ.45వేల కోట్లతో రక్షణశాఖ​ డీల్​!

Last Updated : Nov 30, 2023, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details