తెలంగాణ

telangana

టార్గెట్ చైనా.. సరిహద్దుల్లో ఆధునిక పరికరాల మోహరింపు

By

Published : Oct 30, 2021, 6:21 PM IST

వాస్తవాధీన రేఖ (LAC India china news) వెంట చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. పకడ్బందీ నిఘా కోసం భారత్‌ ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డ్రాగన్‌ అనుమానాస్పద కదలికలు, పెట్రోలింగ్‌ను నిశితంగా ట్రాక్‌ చేసేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక నిఘా పరికరాలను వినియోగిస్తోంది.

india china
భారత్ చైనా

ఇటీవలి కాలంలో తూర్పు సెక్టార్‌లో వాస్తవాధీన రేఖకు (ఎల్‌సీసీ) అతి సమీపంలో చైనా తన సైనిక శిక్షణ కార్యకలాపాలను ముమ్మరం చేయటంతోపాటు బలగాలను మోహరించినట్లు పలువురు సైనికాధికారులు వెల్లడించారు. చైనా బలగాలు(India China News) పెట్రోలింగ్‌ సైతం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)(India China Lac News) వెంబడి పకడ్బందీ నిఘా కోసం భారత్‌ ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డ్రాగన్‌ (India China Latest News) అనుమానాస్పద కదలికలు, పెట్రోలింగ్‌ను నిశితంగా ట్రాక్‌ చేసేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక నిఘా పరికరాలను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ), ఇతర టెక్నాలజీల సాయంతో అభివృద్ధి చేసిన పరికరాలను ఇప్పటికే తూర్పుసెక్టార్‌లో ఎల్‌ఏసీ వెంబడి ఏర్పాటు చేసింది.

ఫేస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ..

ఇక్కడి 5 మౌంటెయిన్‌ డివిజన్ సిగ్నల్స్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ భవ్య శర్మ ఇటీవల 'ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ తవాంగ్ సెక్టార్‌లోని వివాదాస్పద ప్రాంతాలైన నమ్కా చు లోయ, సుమ్‌డోరోంగ్ చు తదితర ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలను ట్రాక్ చేసేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్.. ఎల్‌ఏసీకు(India China Lac News) అతి సమీపంలో వచ్చే చైనా సిబ్బందిని గుర్తించడంలో సహాయపడుతుంది.

అంతకుముందే స్టోర్‌ చేసి ఉన్న డేటాతో సరిపోల్చుతూ పనిచేస్తుంది. ఇందులో ఫేస్ డిటెక్షన్, ఫేస్ రికగ్నైజేషన్‌ అనే రెండు మాడ్యుళ్లు ఉంటాయి. ఏఐ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. ప్రత్యక్ష ప్రసారం, రికార్డు చేసిన వీడియో లేదా ఫొటోల నుంచి మనుషులను గుర్తుపడుతుంది. ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే ఇది పనిచేయడం విశేషం.

డివిజనల్‌ కేంద్రంలో విశ్లేషించి..

దీంతోపాటు దేశీయంగా అభివృద్ధి చేసిన పాన్‌ టిల్ట్‌ హ్యాండ్‌హెల్డ్‌ థర్మల్‌ ఇమేజర్, శాటిలైట్లు, రాడార్లు, గ్రౌండ్ సెన్సార్లు, డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలను(యూఏవీ) భారత్‌ సైన్యం మోహరించింది. అన్ని నిఘా వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని తొలుత ఇక్కడి రూపా ప్రాంతంలోని డివిజనల్‌ నిఘా కేంద్రంలో విశ్లేషిస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి చేరవేస్తారు. డిటెక్షన్‌ కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఆయా పరికరాల నుంచి సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్‌ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చేందుకు సాంకేతికత విశేషంగా దోహదపడుతున్నట్లు 5 మౌంటెయిన్‌ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ జుబిన్ ఏ మిన్‌వాలా తెలిపారు. తద్వారా సకాలంలో తగిన చర్యలు తీసుకోవడానికి సాధ్యపడుతోందని వివరించారు.

ఇదీ చూడండి:Modi Italy Tour: 'అఫ్గాన్ సమస్య మూలకారణాలపై దృష్టిసారించాలి'

ABOUT THE AUTHOR

...view details