తెలంగాణ

telangana

రూ.10 నాణేలతో కారు కొనుగోలు- ఆ న్యూస్ ఫేక్​ అని చెప్పేందుకేనట!

By

Published : Jun 21, 2022, 5:06 PM IST

Updated : Jun 21, 2022, 7:26 PM IST

10 rupee coins buy car

"రూ.10 నాణేల చెల్లవు"... ఇదేదో కేేంద్ర ప్రభుత్వమో, రిజర్వ్​ బ్యాంకో ఇచ్చిన స్టేట్​మెంట్ కాదు. తమిళనాడులోని ధర్మపురి వాసులు పుట్టించిన పుకారు ఇది. ఈ వదంతును పోగొట్టడానికి ఓ వ్యక్తి పెద్ద యుద్ధమే చేశాడు. చివరకు ఓ వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

రూ.10 నాణేలతో ఆరు లక్షల విలువైన కారు కొనుగోలు

రూ.10 నాణేలు చెల్లవని తమిళనాడు, సేలం జిల్లా ధర్మపురిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దుకాణదారులు.. కస్టమర్​ల నుంచి పది రూపాయల నాణేలను స్వీకరించలేదు. రూ.10 నాణేలు చెల్లట్లేదన్న వదంతును ఆపేందుకు ఆరూరుకు చెందిన వెట్రివేల్ వినూత్నంగా ఆలోచించాడు. కేవలం రూ.10 నాణేలను సేకరించి.. వాటితోనే కారు కొనాలని నిర్ణయించుకున్నాడు.

పది రూపాయల నాణేలను లెక్కిస్తున్న కారు షోరూమ్​ సిబ్బంది, వెట్రివేల్​ కుటుంబ సభ్యులు

దేవాలయాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, రోడ్డు పక్కన ఉండే షాపులు వంటి వివిధ ప్రదేశాల్లో రూ.10 నాణేలను సంపాదించాడు వెట్రివేల్. ఆ తర్వాత పది రూపాయల నాణేలు మూటలుగా కట్టి భద్రపరిచాడు. అనంతరం కారును కొనేందుకు సేలంలోని షోరూమ్​కు వెళ్లాడు.

కారు​ కొనుగోలుకు వెట్రివేల్ సేకరించిన పది రూపాయల నాణేలు ​

సేలంలోని ఓ ప్రముఖ కారు షోరూమ్​కు వెళ్లి రూ.10 రూపాయల నాణేలతో కారును కొనాలనుకుంటున్నానని వెట్రివేల్ చెప్పాడు. బ్యాంకు అధికారులను సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని చెబుతామని షోరూమ్​ సిబ్బంది అన్నారు. రూ.10 నాణేలను షోరూమ్​ నుంచి బ్యాంక్​ స్వీకరించేందుకు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల వెట్రివేల్​కు కారును అమ్మేందుకు ​షోరూమ్​ అంగీకరించింది.

వెట్రివేల్​కు కారు తాళాన్ని అందిస్తున్న షోరూమ్​ సిబ్బంది

బంధువులతో కలిసి వెట్రివేల్.. సేలంలోని కారు షోరూమ్​కు వెళ్లాడు. ఆరు లక్షల రూపాయల విలువ గల పది రూపాయల నాణేలను షోరూమ్​ దగ్గర లెక్కించి ఇచ్చాడు. దీంతో కార్​ షోరూమ్​ సిబ్బంది.. వెట్రివేల్​కు కారును అప్పగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది రూపాయల నాణెం ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశానని వెట్రివేల్ అన్నాడు.

రూ.10 నాణేలతో ఆరు లక్షల విలువైన కారు కొనుగోలు

ఇవీ చదవండి:తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు టెన్త్ టాపర్.. రోజూ 10కి.మీ నడిచి బడికెళ్లి..

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య? సాయంత్రం అధికారిక ప్రకటన??

Last Updated :Jun 21, 2022, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details