తెలంగాణ

telangana

చెన్నైలో వరుణుడి బీభత్సం- 2015 తర్వాత ఇదే రికార్డు..

By

Published : Nov 7, 2021, 12:57 PM IST

Updated : Nov 7, 2021, 9:58 PM IST

తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. వానల ధాటికి నగరంలోని జలమయమైన వివిధ ప్రాంతాల్లో ఆయా చోట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్​ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

chennai rains
చెన్నైలో వర్షాలు

భారీ వర్షాల ధాటికి తమిళనాడులోని చెన్నై నగరం చిగురుటాకులా వణిపోతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదల తర్వాత.. చెన్నైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

నీట మునిగిన రహదారులు
నీట మునిగిన వాహనాలు
కాలనీలను ముంచెత్తిన వరద నీరు

భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై నగరంలోని చెంబరంపాక్కం చెరువు గేట్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెంబరపాక్కం కాలువ వెంబడి ఉండే గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.

రోడ్లపైకి చేరిన వరద నీరు
భారీ వర్షాలతో వాహనదారుల ఇక్కట్లు
జలమయమైన రహదారులు

వర్షాల కారణంగా చెన్నై నగరంలోని రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెన్నైతో పాటు తిరువల్లూర్​లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చెన్నైలోని వర్ష ప్రభావిత ప్రాంతాలైన పెరంబూర్ బారక్స్​ రోడ్డు, ఒట్టేరి బ్రిడ్జి, పాడి ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. పరిస్థితులను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. వారికి సహాయక సామగ్రి పంపిణీ చేశారు. ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలను చేపడుతున్నారని సీఎం తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

రానున్న రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయన్న ఐఎండీ అంచనాల నేపథ్యంలో.. చెన్నై, తిరువళ్లూర్, చెంగల్​పేట్, కాంచీపురం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు సీఎం. లోతట్టు ప్రాంతాల్లోని వారిని తరలించేందుకు 160 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం అవసరమైనవారు 1070 హెల్ప్​లైన్ నెంబర్​కు ఫోన్ చేయాలని సూచించారు. చెన్నైకి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు.

సహాయక సామగ్రి అందజేస్తున్న ముఖ్యమంత్రి
చిన్నారులతో మాట్లాడుతున్న స్టాలిన్​

మోదీ ట్వీట్

మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు సీఎంతో ఫోన్​లో మాట్లాడారు ప్రధాని మోదీ. ప్రస్తుత పరిస్థితుల గురించి స్టాలిన్​ను అడిగి తెలుసుకున్నట్లు మోదీ తెలిపారు. సహాయ కార్యక్రమాల కోసం.. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు మోదీ.

ఇదీ చూడండి:పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. నదిలో దూకి..

Last Updated :Nov 7, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details