తెలంగాణ

telangana

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన సుశీల్​

By

Published : Apr 13, 2021, 5:47 PM IST

24వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా సుశీల్​ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఈసీ సునీల్​ అరోడా పదవీ కాలం ఈ నెల 12న ముగిసింది. దీంతో రాష్ట్రపతి ఆదేశానుసారం ఆ తరువాత సీనియర్​ అయిన సుశీల్​ చంద్రను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Sushil Chandra takes charge as 24th CEC
24వ సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన సుశీల్​ చంద్ర

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా సుశీల్‌ చంద్ర మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈసీగా ఉన్న సునీల్‌ ఆరోడా సోమవారం పదవీ విరమణ చేయడం వల్ల ఆయన స్థానంలో సుశీల్‌ చంద్రను నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పార్లమెంటు ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులైన సుశీల్‌ చంద్ర 2022 మే 14 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన ఆధ్వర్యంలో గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ఎన్నికల ప్రధాన కమిషనర్​గా సుశీల్​ చంద్ర!

ABOUT THE AUTHOR

...view details