తెలంగాణ

telangana

లఖింపుర్ ఖేరీ కేసు.. ఆశిశ్​ మిశ్ర బెయిల్​ తీర్పును రిజర్వ్​ చేసిన సుప్రీం

By

Published : Jan 19, 2023, 4:05 PM IST

ajay kumar mishras

లఖింపుర్ ఖేరీ కేసులో నిందితుడు కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్ర కుమారుడు ఆశిశ్​ మిశ్ర వేసిన పిటిషన్​పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్​ చేసింది. కాగా, బెయిల్ పిటిషన్​​ను ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇలాంటి నిందితుడికి బెయిల్​ ఇస్తే సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్తుందని పేర్కొంది.

లఖింపుర్ ఖేరీ దుర్ఘటన కేసులో తనకు బెయిల్​ ఇవ్వాల్సిందిగా నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్​ కుమార్​ మిశ్ర కుమారుడు ఆశిశ్​ మిశ్ర వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని.. సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యంత దారుణంగా కారాగారంలో మగ్గుతున్న బాధితులు రైతులేనని.. ఆశిశ్​ మిశ్రకు బెయిల్​ మంజూరు చేయకపోతే, వారు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఇది ఇరువర్గాల హక్కులను సమతుల్యం చేసే కేసు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, వాదనల సందర్భంగా ఆశిశ్​ మిశ్ర బెయిల్​ పిటిషన్​ను ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం వ్యతిరేకించింది. 8 మంది చనిపోవడానికి కారణమైన వ్యక్తికి బెయిల్​ ఇస్తే సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్తుంది అని అత్యున్నత న్యాయాస్థానానికి తెలిపింది. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తరఫున అడ్వకేట్​ జనరల్ గరిమ ప్రషద్ హాజరై వాదనలు వినిపించారు.
2021 అక్టోబర్‌ 3న ఉత్తర్​ ప్రదేశ్‌ లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిశ్ మిశ్ర వాహనంలో ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిశ్ మిశ్ర అరెస్టయ్యారు.

ABOUT THE AUTHOR

...view details