తెలంగాణ

telangana

టీచర్లుగా తల్లీకొడుకులు.. ఇద్దరి మధ్య వయసు ఏడేళ్లే తేడా!.. సవతి కుమారుడి ఫిర్యాదుతో..

By

Published : Aug 5, 2023, 3:15 PM IST

Step Son Compliant On Step Mother Age : తల్లి, ఆమె కుమారుడి వయసులపై అధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ సవతి కొడుకు. వీరిద్దరి వయసుల మధ్య కేవలం 7ఏళ్లు మాత్రమే తేడా ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో బిహార్​ అధికారులు విచారణకు ఆదేశించారు.

step-son-compliant-on-step-mother-teacher-age-in-bihar-teacher-mother-is-just-7-years-older-than-son
టీచర్లుగా పనిచేస్తున్న తల్లీకొడుకుల మధ్య ఏడేళ్లే తేడా! సవతి కొడుకు ఫిర్యాదు

Step Son Compliant On Step Mother Age : టీచర్లుగా పనిచేసే తల్లి, ఆమె కుమారుడు వయసుల మధ్య కేవలం 7ఏళ్లు మాత్రమే తేడా ఉందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, విద్యాశాఖకు ఫిర్యాదు చేశాడు సవతి కుమారుడు. తల్లీకొడుకుల మధ్య ఇంత తక్కవ వయసు తేడా ఉండటం ఎలా సాధ్యమని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం ఉన్నతాధికారులకు సమర్పించాడు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు కంగుతిన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బిహార్​లోని సీతామఢీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు సతీశ్​ పాశ్వాన్..​ రామ్ ప్రకాశ్​ పాశ్వాన్​ మొదటి భార్య కొడుకు. కామిని కుమారి అనే మహిళ రామ్ ప్రకాశ్​ పాశ్వాన్​ మొదటి భార్య. ఈమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. వీరి కొడుకు సుశీల్ కుమార్. ఆయన కూడా టీచర్​గానే పనిచేస్తున్నాడు. కామిని కుమారి పరిహార్ బ్లాక్‌లోని మన్‌పుర్ అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్​లో ఈ మధ్యే టీచర్​గా నియమాకం అయింది. ఆమె పెద్ద కొడుకు సుశీల్ కుమార్ కూడా పోఖర్ తోలా బరియార్‌పుర్‌లోని దుమ్రా ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ అయ్యాడు.

అయితే వీరిద్దరి మధ్య 18 ఏళ్లు తేడా ఉండాలని.. కానీ కేవలం 7సంవత్సరాలే ఉన్నాయని సతీశ్​ పాశ్వాన్​ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశోధించి.. తప్పు అని తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశాడు. ఇరువురికి సంబంధించిన జనన ధ్రువపత్రాల రుజువులు సైతం అధికారులకు సమర్పించాడు. కామిని కుమారి 1976 ఆగష్టు 15న.. సుశీల్​ కుమార్​ 1983 ఏప్రిల్​ 18న జన్మించినట్లు వారికి వివరించాడు.

అయితే పూర్తి విచారణ తరువాతే నిజానిజాలు తెలుస్తాయని మన్‌పుర్​ మిడిల్ స్కూల్ ప్రిన్స్​పల్​ తెలిపారు. ధ్రువపత్రాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి సమాచారం కోరినట్లు ఆయన వెల్లడించారు. రామ్​ ప్రకాశ్​ పాశ్వాన్​ రెండు వివాహాలు చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కుటుంబాన్ని రామ్​ ప్రకాశ్​ సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే సతీశ్​కు తండ్రికి గొడవలు జరిగాయి. దీంతో సవతి తల్లి, ఆమె కొడుకు వయసులపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు సతీశ్​.

ABOUT THE AUTHOR

...view details