తెలంగాణ

telangana

'మన టీకా కోసం మరో 25 దేశాలు వెయిటింగ్​'

By

Published : Feb 6, 2021, 7:35 PM IST

Updated : Feb 6, 2021, 7:45 PM IST

మన దేశంలో తయారవుతున్న కొవిడ్​ టీకాల కోసం మరో 25 దేశాలు ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్. మరోవైపు గ్రాంట్ రూపంలో కొన్ని పేద దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.

Some progress during military talks on Ladakh standoff but no visible expression on ground: Jaishankar
'మన టీకా కోసం మరో 25 దేశాలు వెయిటింగ్​'

భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా కోసం మరో 25 దేశాలు వరుసలో ఉన్నాయన్నారు జైశంకర్. ఇప్పటికే సుమారు 15 దేశాలకు టీకాలు సరఫరా చేసినట్లు తెలిపారు.

"ఇప్పటివరకు సుమారు 15 దేశాలకు కరోనా టీకాలు అందించాం. మరో 25 దేశాలు ఆ వరుసలో ఉన్నాయి. టీకాల విషయంలో‌ మనం వ్యవహరిస్తోన్న తీరు.. ప్రపంచం ముందు భారత్​ను సమున్నతంగా నిలబెట్టింది"

- ఎస్​ జైశంకర్, విదేశాంగ మంత్రి

గ్రాంట్ రూపంలో కొన్ని పేద దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. మరికొన్ని దేశాలు, ఔషధ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకా పంపిణీ జరుగుతోందన్నారు.

కరోనా వైరస్ కట్టడికి భారత్‌ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర అనుమతులిచ్చి.. వాటిని దేశవ్యాప్తంగా జరుగుతోన్న టీకా కార్యక్రమంలో వినియోగిస్తుండటంతో పాటు ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తోంది. కరోనా పోరాటంలో భారత్‌ చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇదీ చూడండి:బంగాల్ దంగల్: నందిగ్రామ్​లో మళ్లీ ఆనాటి రక్తపాతం!

Last Updated :Feb 6, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details