తెలంగాణ

telangana

'ప్రతి పురుషుడిని రేపిస్ట్ అంటే ఎలా?'

By

Published : Feb 2, 2022, 4:03 PM IST

Smriti Irani On Marital Rape: ప్రతి వివాహం హింసాత్మకమని ఖండించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్​ అని అనడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అభిప్రాయపడ్డారు. 'వైవాహిక అత్యాచారం'పై రాజ్యసభలో ప్రతిపక్షాలు సంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Smriti Irani
స్మృతి ఇరానీ

Smriti Irani On Marital Rape: దేశంలోని మహిళలు, చిన్నారులను సంరక్షించడం మన ప్రాథమిక కర్తవ్యం అని అన్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. అలా అని ప్రతి వివాహం హింసాత్మకం అని ఖండించడం, ప్రతి పురుషుడిని రేపిస్ట్​ అని అనడం ఆమోదయోగ్యం కాదని రాజ్యసభలో స్పష్టం చేశారు.

'వైవాహిక అత్యాచారం'అనే విషయంపై సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వమ్ సభలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు స్మృతి ఇరానీ. గృహ హింస నిర్వచనాన్ని గృహహింస చట్టంలోని సెక్షన్ 3 నుంచి తీసుకుందా? అత్యాచారం నిర్వచనాన్ని ఐపీసీ సెక్షన్ 375 నుంచి తీసుకుందా? లేదా? అని ప్రశ్నలు సంధించారు ఎంపీ బినోయ్ విశ్వమ్.

రూల్ 47 ప్రకారం ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశాలపై సభలో చర్చించొద్దని సీనియర్ నేతకు తెలుసని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. దేశంలోని మహిళల భద్రతకు రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. 'ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 హెల్ప్​లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. 66లక్షల మంది మహిళలకు సాయపడ్డాయి. అంతేకాక దేశవ్యాప్తంగా 703 వన్ స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు 5లక్షల మంది మహిళలు సేవలు అందించాయి.' అని వివరించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.

వివాహ వ్యవస్థకు అర్థం లేదు..

ఒకవేళ భార్యపై బలవంతపు శృంగారాన్ని నేరంగా భావించాలని కేంద్రం భావిస్తే.. వివాహ వ్యవస్థ అన్న పదానికి అర్థం లేదన్నారు భాజపా నేత సుశీల్ మోదీ.

గృహహింసపై స్కూల్, కాలేజీ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారా? అని డీఎంకే మహమ్మద్ అబ్దుల్లా రాజ్యసభలో ప్రశ్నించారు.

ప్రభుత్వం 'భేటీ బచావో భేటీ పడావో' పథకం ద్వారా విద్యార్థినులకు రాజ్యంగంలోని హక్కులు, కర్తవ్యాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వివరించారు.

ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు అధికమవుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత రజనీ అశోక్​రావ్ పటేల్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి.. 'సంవాద్' అనే పేరుతో కేంద్రం ఓ హెల్ప్​లైన్ ప్రారంభించిందని, దీనిలో భాగంగా మానసిక ఆరోగ్యం సరిగా లేని లక్షమందికిపైగా చిన్నారులకు సేవలు అందించినట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:'భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారం కాదు'

ABOUT THE AUTHOR

...view details