తెలంగాణ

telangana

కాన్పుర్​లో జికా కలకలం- కొత్తగా ఆరు కేసులు

By

Published : Nov 1, 2021, 10:24 AM IST

యూపీలోని కాన్పుర్​లో జికా వైరస్ (Zika virus in Kanpur) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కాన్పుర్​లో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం పాజిటివ్ కేసుల (Zika virus in India) సంఖ్య 10కి చేరింది.

Six more Zika virus cases in UP's Kanpur,
కాన్పుర్​లో జికా కలకలం

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో జికా వైరస్ (Zika virus in India) కలకలం సృష్టిస్తోంది. చకేరీ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి వైరస్ పాజిటివ్​గా తేలింది. దీంతో నగరంలో జికా కేసుల సంఖ్య 10కి చేరింది.

ఆదివారం నిర్వహించిన నమూనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్​గా (Zika virus in Kanpur) వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ గర్భిణీ సహా నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులకు జికా ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్ విశాక్ అయ్యర్, ఇతర వైద్యాధికారులు చకేరీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

జికా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. అనుమానిత కేసులను పసిగట్టే పనిలో పడ్డారు. చకేరీ ప్రాంతం నుంచి 645 నమూనాలను వైద్య బృందాలు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం లఖ్​నవూలోని కేజీఎంయూ, పుణెలోని వైరాలజీ ఇన్​స్టిట్యూట్​కి పంపించారు.

ప్రత్యేక వార్డు

జికా బాధితుల కోసం కాన్షీరాం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు యూపీ అంటువ్యాధుల శాఖ డైరెక్టర్ జీఎస్ బాజ్​పాయ్ తెలిపారు. బాధితులను దోమ తెరల లోపల ఉంచుతున్నట్లు చెప్పారు. కొత్తగా పాజిటివ్​గా తేలిన ఆరుగురిని హోమ్ క్వారంటైన్​లో ఉంచినట్లు వెల్లడించారు. ఎవరికీ లక్షణాలు (Zika virus symptoms) లేవని చెప్పారు. బాధితులకు చికిత్స (Zika virus Treatment) ప్రారంభించామని తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు బాధితుల కుటుంబ సభ్యులను బయటకు రావొద్దని స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్​గా గుర్తించారు.

శనివారం ముగ్గురికి జికా పాజిటివ్​గా తేలింది. ఇందులో ఇద్దరు ఎయిర్​ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. అంతకుముందు, అక్టోబర్ 23న తొలి కేసు నమోదైంది. దీంతో, కేంద్రం నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది.

ఇదీ చదవండి:జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ABOUT THE AUTHOR

...view details