తెలంగాణ

telangana

శివరాత్రి రోజే ఘోరం.. యాక్సిడెంట్​లో ఆరుగురు భక్తులు మృతి

By

Published : Mar 1, 2022, 6:13 PM IST

Shivaratri road accident Odisha: మహాశివరాత్రి రోజు ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని ఓ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన ఛత్తీస్​గఢ్ వాసుల కారు.. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

shivaratri road accident
shivaratri road accident

Shivaratri road accident Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నౌపాద జిల్లా సదార్ బ్లాక్​ సునీసియా ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

చెట్టును ఢీకొట్టిన కారు

Chhattisgarh devotees died Odisha

మృతులంతా ఛత్తీస్​గఢ్​లోని మహాసముంద్ జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా వీరంతా ఒడిశా బర్గాడ్ జిల్లాలోని నృసింఘనాథ్ మందిరాన్ని దర్శించుకున్నారని చెప్పారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని చెప్పారు. ఘటనాస్థలిలోనే ఆరుగురు చనిపోయారని స్పష్టం చేశారు.

సమాచారం అందుకొని పోలీసులు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన కేంద్రంలోని ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.

ఇదీ చదవండి:ఎన్నికల వేళ.. పోలీసులపై గూండాల దాడి- బస్సు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details