తెలంగాణ

telangana

యజమాని కుమార్తెపై లైంగిక దాడి.. ఆపై హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి డబ్బాలో కుక్కి..

By

Published : Apr 27, 2023, 7:44 AM IST

తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. అనంతరం హత్య చేసి.. మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు, రెండున్నరేళ్ల చిన్నారిని కాళ్లు, చేతులు కట్టేసి ఓ ప్లాస్టక్ డబ్లాలో పడేశాడో దుండగుడు. ఊపిరాడక చిన్నారి ప్రాణాలో కోల్పోయింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

A school girl was sexually assaulted in ooty tamilnadu
A school girl was sexually assaulted in ooty tamilnadu

తమిళనాడులో దారుణం జరిగింది. తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని కుమార్తె(14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. అనంతరం హత్య చేసి.. మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన ఊటీ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
నిందితుడు.. గర్భవతైన తన భార్యతో ఊటీలో నివసిస్తున్నాడు. ఓ టూరిస్ట్ సెంటర్​లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి కుమార్తెపైనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను దారిలో చూసిన నిందితుడు.. ఆమెతో మాట కలిపాడు. ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. ఓ నిర్జన ప్రదేశంలోకి బాలికను తీసుకెళ్లాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రతిఘటించడం వల్ల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. అయినా.. కనికరించని దుండగుడు.. స్కూల్ ఐడీ కార్డు ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పడేశాడు.

బాలిక ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి.. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు ముళ్లపొదల్లో బాలిక విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అడవిలో దాక్కున్న నిందితుడిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనలో.. బాలిక తల్లిందండ్రులకు, నిందితుడికి గొడవలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాళ్లు, చేతులు కట్టేసి.. చిన్నారి హత్య
బిహార్​లో హృదయ విదారక ఘటన జరిగింది. రెండున్నరేళ్ల చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి డబ్బాలో కుక్కారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పట్నా జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కదమ్​కువాన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గాజీపుర్​ ప్రాంతంలో భరత్​ కుమార్​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పెయింటర్​గా పనిచేస్తూ.. సాయంత్రం ఛాయ్​ దుకాణం నడుపుతున్నాడు. అతడికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. ఓ రోజు ఉదయం నుంచి చిన్నారి కనిపించలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎంతకీ చిన్నారి ఆచూకీ దొరకకపోవడం వల్ల.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక కోసం ముమ్మరంగా గాలించారు. సీసీటీవీలను పరిశీలించారు. చివరకు ఇంట్లో వెతకగా.. వంటగదిలోని ఓ ప్లాస్టిక్​ డబ్బాలో చిన్నారి కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో చిన్నారి విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్​ సైన్స్​ లాబొరేటరీ బృందం కూడా ఘటన స్థలాన్ని పరిశీలించింది. ఇప్పటివరకు ఈ హత్య ఎవరు చేశారన్న విషయంపై స్పష్టత రాలేదు.

ABOUT THE AUTHOR

...view details