తెలంగాణ

telangana

'ఆ శృంగారం అత్యాచారం కాదు'

By

Published : Aug 6, 2021, 10:17 AM IST

మైనర్ భార్యతో భర్త శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కాదని వ్యాఖ్యానించింది అలహాబాద్​ హైకోర్టు. 15ఏళ్లుపైబడిన భార్యతో సంభోగం చేయడం ఐపీసీ సెక్షన్​ 375 కింద నేరం కాదని పేర్కొంది. ఓ కేసులో నిందితుడికి బైయిల్​ మంజూరు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

IPC section 375
ఐపీసీ సెక్షన్​ 375

15 ఏళ్లపైబడిన మైనర్​ భార్యతో భర్త శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదని పేర్కొంది అలహాబాద్ హైకోర్టు​. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. 15ఏళ్ల పైబడిన మైనర్​ భార్యతో సంభోగం చేసినట్లయితే అది అత్యాచారం కాదని స్పష్టం చేసింది. వరకట్నం కోసం తన మైనర్​ భార్యను హింసించాడని, వికృత శృంగారం చేశాడన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న నిందితుడికి బెయిల్​ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.

అందుకు మినహాయింపు

ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. అత్యాచారం అనేది మహిళ అంగీకారం లేకుండా సంభోగం చేయడం. అయితే 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న భార్యతో భర్త శృంగారంలో పాల్గొనడానికి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్​ను.. క్రిమినల్​ లా సవరణ చట్టం-2013 ద్వారా సవరించారు. ఇందులో సంభోగానికి సమ్మతి వయస్సు 18 ఏళ్లకు పెంచారు. అయితే భార్య 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వైవాహిక సంభోగానికి మినహాయింపు ఇచ్చింది. దీంతో పరోక్షంగా 15-18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లను భర్త బలవంతపు శృంగారం చేయడానికి ఆస్కారం కలిపిస్తున్నట్లయిందని హైకోర్టు పేర్కొంది.

కేసు నేపథ్యం

గతేడాది సెప్టంబరు 8న.. వరకట్న వేధింపులు, దాడి, వికృత శృంగారం కోసం తన భర్త బలవంతం చేసినట్లు యూపీ మోరాదాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు ఖుషాబే అలీపై భార్య ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్​ మొహమ్మద్ అస్లాం.. అలీకి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

అయితే... 18 ఏళ్లు లోపు భార్యతో లైంగిక సంబంధం అత్యాచారమేనని 2017లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం.

ఇదీ చూడండి:'లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయి'

ABOUT THE AUTHOR

...view details