తెలంగాణ

telangana

ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు

By

Published : Aug 1, 2022, 5:24 PM IST

Updated : Aug 1, 2022, 6:36 PM IST

Jabalpur hospital fire
Jabalpur hospital fire

Jabalpur hospital fire: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు

Jabalpur hospital fire: మధ్యప్రదేశ్‌ జబల్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. జబల్‌పుర్‌లోని దామోహ్ నాకా ప్రాంతంలో ఉన్న న్యూలైఫ్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఆస్పత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ.. పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రిలోని రోగులను బయటకు తరలించారు. ఆస్పత్రి భవనమంతా గాలించామని.. లోపల ఎవరూ చిక్కుకుపోలేదని అగ్నిమాపక అధికారులు చెప్పారు. ఆస్పత్రి మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు. షార్ట్​ సర్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ దిగ్భ్రాంతి..: ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తననెంతగానో కలిచివేసిందన్నారు. స్థానిక అధికారులు, కలెక్టర్‌తో తాను టచ్‌లోనే ఉన్నానని.. ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున సాయం అందించనున్నట్టు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన.. వారి వైద్య సాయానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఇవీ చదవండి:రోడ్డు దాటేందుకు జేసీబీ.. సీఎం సొంత నియోజకవర్గంలోనే

వందకు 151 మార్కులు.. అయినా ఫెయిల్.. సున్నా వచ్చిన విద్యార్థి పాస్!

Last Updated :Aug 1, 2022, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details