తెలంగాణ

telangana

జమ్ముకశ్మీర్​ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల

By

Published : Mar 14, 2022, 11:07 AM IST

Updated : Mar 14, 2022, 12:25 PM IST

పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు

12:21 March 14

కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​ బడ్జెట్​ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. గ్రాంట్లు, అదనపు గ్రాంట్ల డిమాండ్లను కూడా లోక్​సభలో సమర్పించారు.

11:48 March 14

పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగానే లోక్‌సభ సభలో నరేంద్ర మోదీ నినాదాలు మార్మోగాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కమలదళం విజయానికి ప్రధాని మోదీని అభినందిస్తూ భాజపా సభ్యులు లోక్‌సభలో బల్లలు చరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రవేశించగానే భాజపా ఎంపీలు, మంత్రులు జై భారత్ నినాదాలు చేశారు. మోదీ మోదీ అంటూ అరస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

11:02 March 14

జమ్ముకశ్మీర్​ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల

Parliament Budget session: పార్లమెంట్ బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం, జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతానికి బడ్జెట్‌ కేటాయింపు ప్రతిపాదనలే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా కేంద్రం సమావేశాలకు సిద్ధమైంది. జమ్ముకశ్మీర్‌కి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలుచూస్తున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, EPFOపై వడ్డీ రేటు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు ఇప్పటికే నిర్ణయించాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం ఏప్రిల్ 8 వరకు జరగనుంది. తొలిఅర్ధభాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది

Last Updated : Mar 14, 2022, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details