తెలంగాణ

telangana

నీట్​ వాయిదాకు సుప్రీం నో- షెడ్యూల్​ ప్రకారమే పరీక్ష

By

Published : Sep 6, 2021, 3:09 PM IST

నీట్​-2021 పరీక్ష(neet ug 2021) వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది సుప్రీం కోర్టు(supreme court on neet). కేవలం కొందరి కోసం లక్షల మంది హాజరయ్యే పరీక్షను వాయిదా వేయలేమని, షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది.

NEET-UG exam
నీట్​ వాయిదాకు సుప్రీం నో

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష-నీట్‌ను(neet ug 2021) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(supreme court on neet) తోసిపుచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12నే నీట్‌ జరుగుతుందని స్పష్టం చేసింది. అందులో కలుగజేసుకోదలుచుకోలేదని, పరీక్ష తేదీని మార్చటం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది.

సెప్టెంబర్​ 12న ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్​ఈ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల నీట్‌(neet 2021 latest news) వాయిదా వేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌రు షికేష్‌రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం వీటిని తోసిపుచ్చింది.

"కేవలం కొంతమంది కోసం 16లక్షల మందికిపైగా హాజరయ్యే పరీక్షను వాయిదా వేయలేం. విద్యా వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఎక్కువగా జోక్యం చేసుకోదు. తమ తీర్పుల వల్ల లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అదే రోజు ఎక్కువ పరీక్షలు ఉంటే ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. అంతేగానీ, నీట్‌ వాయిదా వేయడం కుదరదు."

- సుప్రీం ధర్మాసనం.

నీట్​ పరీక్ష చాలా పెద్దదని, కేవలం ఒక రాష్ట్రానికే సంబంధించినది కాదని.. పరీక్షల రీషెడ్యూల్​ విద్యా సంవత్సరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది ధర్మాసనం.

నీట్​-2021 పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. తొలిసారి పంజాబీ, మలయాళాన్ని చేర్చుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ జులైలో ప్రకటించారు. అలాగే.. పశ్చిమాసియాలోని భారతీయ విద్యార్థుల సౌకర్యార్థం కూవైట్​లోనూ నీట్​ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:పీజీ నీట్‌ లేనట్టే..! ఎగ్జిట్‌ పరీక్ష మార్కులే ప్రామాణికం

ABOUT THE AUTHOR

...view details