తెలంగాణ

telangana

నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి: మోహన్ భగవత్

By

Published : May 16, 2021, 7:30 AM IST

కరోనా మహమ్మారి మొదటి దశ తర్వాత ప్రభుత్వం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో పరస్పరం నిందించుకోవడానికి బదులు అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

RSS head mohan bhagavath
ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్‌ భగవత్‌

కొవిడ్‌-19 మొదటి ఉద్ధృతి తర్వాత దేశంలోని అన్ని వర్గాల్లోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్‌ భగవత్‌ శనివారం పేర్కొన్నారు. అదే ప్రస్తుత పరిస్థితికి కారణమైందన్నారు.

"మొదటి విజృంభణ తర్వాత మనలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ప్రజలు, ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం.. ఇలా అందరిలోనూ అదే ధోరణి. రెండో ఉద్ధృతి వస్తుందని మనకు తెలుసు. వైద్యులూ హెచ్చరించారు. అయినా మన పద్ధతి మారలేదు".

-- మోహన్​భగవత్​, ఆర్​ఎస్​ఎస్​ అధినేత

అయితే సంక్షోభ సమయంలో పరస్పరం నిందించుకోవడానికి బదులు అందరూ ఐక్యంగా పనిచేయాలని మోహన్​భగవత్​ సూచించారు. కరోనాపై పోరులో ప్రజలు సానుకూల ధోరణితో, చురుగ్గా ఉండాలని కోరారు. కొవిడ్‌ 'నెగిటివ్‌'గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 'పాజిటివిటీ అన్‌లిమిటెడ్‌'పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

మరోవైపు కొవిడ్‌పై పోరు అంశంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలని ఆర్​ఎస్​ఎస్​ సీనియర్‌ నేత, భాజపా మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ సూచించారు.

ఇదీ చదవండి :ఆపత్కాలంలోనూ రాజకీయాలేనా.. విచక్షణ ఏది?

ABOUT THE AUTHOR

...view details