తెలంగాణ

telangana

రేపు రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం - సీఎం జగన్‌, చంద్రబాబుకు ఆహ్వానం

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 1:43 PM IST

Updated : Dec 6, 2023, 3:28 PM IST

Revanth Reddy Oath-Taking Invitation to Chandrababu Naidu, CM Jagan: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు. వీరితోపాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ఆహ్వానించారు.

revanth_reddy_oath_taking_invitation
revanth_reddy_oath_taking_invitation

Revanth Reddy Oath-Taking Invitation to CM Jagan, Chandrababu Naidu: తెలంగాణ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న అనుముల రేవంత్‌ రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు. రేపు (గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy will Take Oath CM Tomorrow: రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలు, అధికారులు హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు, తెలంగాణ హైకోర్టు సీజే, వివిధ కులసంఘాల నేతలు, మేధావులకు రేవంత్ రెడ్డి ఆహ్వానాలు పంపించారు.

ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లలో అధికారులు

Revanth Reddy Invites Chandrababu, CM Jagan:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం జగన్‌, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకురేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు. వీరితోపాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌‌, మంత్రులకు కూడా ఆయన (రేవంత్ రెడ్డి) ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు.

Revanth Reddy, Telangana Election Result 2023 Live : 'ప్రగతిభవన్ పేరును అంబేడ్కర్ ప్రజా భవన్​గా మారుస్తాం'

Revanth Reddy Invitation to Former CMs: ఉత్తర భారతదేశానికి సంబంధించి అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానాలు పంపించారు. వీరితోపాటు దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణికం ఠాగూర్‌, చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ శిందే, కురియన్‌లను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Revanth Reddy Invitation to Telangana Movement Martyrs Families: చివరగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి, ఆ ఉద్యమంలో అమరులైనా కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు. వారితోపాటు ప్రొఫెసర్‌లు కోదండ రామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యలకు కూడా ఆయన ఆహ్వానాలు పంపించారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టు సీజేకు, వివిధ కులసంఘాల నేతలు, మేధావులకు కూడా ప్రమాణ స్వీకార ఆహ్వానాలను పంపించారు.

సీఎం రేవంత్​కు అఖండ ఆశీస్సులు - మీ మార్క్ పాలనతో తెలంగాణకు శ్రీరామరక్ష

Last Updated : Dec 6, 2023, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details