తెలంగాణ

telangana

జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్​పై నెటిజన్లు ఫైర్​.. నలుగురు పిల్లలున్నారంటూ..!

By

Published : Jul 24, 2022, 9:51 AM IST

Ravi kishan population control bill: జనాభా నియంత్రణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ విషయం వెల్లడించగానే ఆయనపై నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. నలుగురు పిల్లలకు తండ్రిగా ఉన్న రవికిషన్ ఈ బిల్లును ప్రవేశపెట్టడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

population control bill ravi kishan
రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లు

Ravi kishan population control bill: జనాభా నియంత్రణపై తాను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నటుడు, లోక్‌సభ ఎంపీ రవికిషన్ వెల్లడించారు. ఒక జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండకుండా నిరోధించడమే దీని లక్ష్యం. 'జనాభా నియంత్రణ బిల్లు తీసుకువచ్చినప్పుడే మనం విశ్వగురువు కాగలం. జనాభా నియంత్రణ అత్యావశ్యకం. ప్రస్తుతం మనం జనాభా విస్ఫోటం దిశగా వెళ్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టేలా విపక్ష పార్టీలు సహకరించాలి. నేను ఎందుకు ఈ బిల్లు పెట్టాలనుకుంటున్నానో వినాలని కోరుతున్నాను' అంటూ రవి కిషన్ వెల్లడించారు. కేంద్రమంత్రులు కాకుండా పార్లమెంట్‌ సభ్యులు ప్రవేశపెట్టేవాటిని ప్రైవేటు బిల్లులు అంటారు. ఇప్పుడు రవికిషన్ ప్రవేశపెట్టేది కూడా ప్రైవేటు బిల్లే.

ఇదిలా ఉండగా.. ఈ బిల్లు ప్రవేశపెడతానని రవికిషన్ చెప్పగానే.. ఆయనపై నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఆయన నలుగురు పిల్లలకు తండ్రి కావడమే అందుకు కారణం. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఆడపిల్లల కంటే కుమారుడు చిన్నవాడు కావడంపైనా ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటి భారత్‌ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని '2022 ప్రపంచ జనాభా అంచనాల' నివేదికను ఐరాస విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లు తెరపైకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details