తెలంగాణ

telangana

రైల్వేశాఖలో 4వేల పోస్ట్​లకు నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

By

Published : Jan 9, 2023, 1:49 PM IST

నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్తను అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి దక్షిణమధ్య రైల్వే నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఎన్ని పోస్టులున్నాయి?ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

Railway recruitment 2023 latest news
రైల్వేశాఖలో జాబ్స్ నోటిఫికేషన్స్

రైల్వేశాఖలో ఉద్యోగంలో సంపాదించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్​న్యూస్. దక్షిణ మధ్య రైల్వే 4,103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, పెయింటర్ వంటి అప్రెంటిస్​ పోస్టుల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు కావలసిన అర్హత, వయోపరిమితి, దరఖాస్తు చివరి తేదీ, శాలరీ వంటి వివరాలు మీకోసం..

మొత్తం పోస్టులు : 4,103

  • ఏసీ మెకానిక్ పోస్టులు : 250
  • కార్పెంటర్ పోస్టులు : 18
  • డీజిల్ మెకానిక్ పోస్టులు : 71
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు : 1,019
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు : 92
  • ఫిట్టర్ పోస్టులు : 1,460
  • మెషినిస్ట్ పోస్టులు : 71
  • మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ (ఎంఎంటీఎం) పోస్టులు : 05
  • మిల్ రైట్ మెయింటెనెన్స్ పోస్టులు (ఎంఎండబ్ల్యూ) పోస్టులు : 24
  • పెయింటర్ పోస్టులు : 80
  • వెల్డర్ పోస్టులు : 553

వయో పరిమితి :
అభ్యర్థి వయసు డిసెంబర్ 30 నాటికి 24 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుల ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 30-12-2022
  • దరఖాస్తుల ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 29-01-2023 సాయంత్రం 5 గంటల వరకు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్​ను సంప్రదించండి.. scr.indianrailways.gov.in

ABOUT THE AUTHOR

...view details