తెలంగాణ

telangana

Rahul Gandhi On Caste Census : 'అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం'.. రైలులో ప్రయాణించిన రాహుల్

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 5:45 PM IST

Updated : Sep 25, 2023, 7:09 PM IST

Rahul Gandhi On Caste Census : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామన్నారు.

Rahul Gandhi On Caste Census
Rahul Gandhi On Caste Census

Rahul Gandhi On Caste Census :తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'ఆవాస్ న్యాయ సమ్మేళన్‌'లో పాల్గొన్న రాహుల్.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తమ పార్టీ రీమోట్‌ కంట్రోల్‌ను నొక్కితే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరతాయన్న రాహుల్‌... అదే బీజేపీ రీమోట్‌ కంట్రోల్‌ నొక్కితే అదానీకి విమానాశ్రయాలు, పోర్టులు, కాంట్రాక్ట్‌లు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేబినెట్‌ క్యార్యదర్శులు, కార్యదర్శులే నడుపుతారని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది కార్యదర్శుల్లో.. ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతాన్ని మాత్రమే వీరు నియంత్రిస్తున్నారన్న రాహుల్.. దేశంలో ఐదు శాతమే ఓబీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.

"బీజేపీ లేదా మోదీ ఒకసారి బటన్‌ నొక్కితే అదానీకి మంబయి ఎయిర్‌పోర్ట్‌, రెండోసారి నొక్కితే రైల్వే ప్రాజెక్టులు, మూడోసారి నొక్కితే మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్‌లు లభిస్తాయి. ప్రస్తుతం రెండు రిమోట్‌ కంట్రోల్‌లు నడుస్తున్నాయి. ఇది మా పార్టీ రిమోట్ కంట్రోల్‌. దీన్ని నొక్కితే క్వింటా వరి ధాన్యానికి రూ. 2,500 నగదు నేరుగా రైతుల ఖాతాలో జమవుతాయి. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నిర్మితమవుతాయి. అయితే బీజేపీ బటన్‌ నొక్కితే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయిపోతాయి."

--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు

రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Train Journey : బిలాస్​పుర్​ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ రైలులో ప్రయాణించారు. బిలాస్​పుర్​ నుంచి రాయ్​పుర్​ వరకు రైలులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే రైలులోని ప్రయాణికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.
కాగా, రాహుల్ ఇటీవల రైల్వే కూలీలతో ముచ్చటించారు. దిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్​లో పనిచేస్తున్న కూలీలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే కూలీల యూనిఫాం ధరించి లగేజీని సైతం రాహుల్ మోశారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rahul Gandhi On Modi : 'మోదీజీ.. కుల గణనకు భయమెందుకు? మహిళా రిజర్వేషన్ల కోసం పదేళ్లు ఆగాలా?'

Rahul Gandhi Vs Amit Shah On OBCs : రాహుల్​ వర్సెస్ షా.. ఓబీసీలకు ప్రాధాన్యంపై డైలాగ్ వార్

Last Updated :Sep 25, 2023, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details