తెలంగాణ

telangana

Puri Jagannath Temple: దశల వారీగా తెరుచుకోనున్న పూరీ ఆలయం

By

Published : Aug 13, 2021, 5:06 AM IST

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం (Puri Jagannath Temple) దశల వారీగా తెరుచుకోనుంది. దర్శన నిమిత్తం ఆగస్టు 23 నుంచి భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొవిడ్‌ టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్​ నెగిటివ్​ ధ్రువపత్రం తప్పనిసరి అని నిర్వాహకులు స్పష్టం చేశారు.

puri jagannath temple
దశల వారీగా తెరుచుకోనున్న పూరీ ఆలయం

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం (Puri Jagannath Temple) దశల వారీగా తెరుచుకోనుంది. కొవిడ్‌ నిబంధలను లోబడి మూడు నెలలు ఆలయాన్ని మూసివేశారు. రథయాత్ర సమయంలోనూ కొవిడ్‌ దృష్ట్యా కొంతమందితోనే నిర్వహించారు. తాజాగా ఈ ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని దశల వారీగా కల్పిస్తామని ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దర్శన నిమిత్తం ఆగస్టు 23 నుంచి భక్తులకు ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నారు.

  • మొదటి దశలో: మంగళ హారతి నుంచి రతి పహుదా వరకు ఆలయ సేవకుల కుటుంబ సభ్యులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారి ఒకరు తెలిపారు. వారు ఆలయంలోకి ప్రవేశించాలంటే ఆధార్ కార్డుతో పాటు ఆలయ అధికారులు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.
  • రెండవ దశలో: పూరీ నివాసితులు ఆగస్టు 16 నుంచి సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.

అయితే, కొవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఆగస్టు 21, 22 తేదీల్లో ఆలయం మూసివేసి ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొవిడ్‌ టీకా సర్టిఫికెట్ లేదా 96 గంటల ముందు టెస్ట్‌ చేయించుకున్న నెగిటివ్ ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టును చూపించాలి. వారితోపాటు ఆధార్‌కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

ఇదీ చూడండి :101 అడుగుల కాన్వాస్​పై 'బొమ్మల రామాయణం'

ABOUT THE AUTHOR

...view details