తెలంగాణ

telangana

విమానాల్లో బ్యాలెట్​ బాక్స్​ల జర్నీ.. ప్యాసింజర్​లా టికెట్​.. స్పెషల్​ సీట్​!

By

Published : Jul 12, 2022, 5:05 PM IST

president-poll-when-ballot-boxes-fly-as-passengers

President Poll ballot boxes: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఉపయోగించే బ్యాలెట్​ బాక్సులు.. సాధారణ ప్రయాణికుడి వలె విమానాల్లో ఎగరనున్నాయి. వీటి కోసం ప్రత్యేక సీటు కూడా కేటాయిస్తారు. ఇందుకోసం టికెట్​ తీసుకోవాల్సి ఉంటుంది. జులై 18న పోలింగ్​ నేపథ్యంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టింది.

President Poll ballot boxes: జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అధికార పక్షం నుంచి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్​ సిన్హా పోటీలో ఉన్నారు. జులై 21న తదుపరి రాష్ట్రపతి ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పేపర్లు, ఓటు వేసేందుకు ఉపయోగించే ప్రత్యేక పెన్నుల పంపిణీ మొదలుపెట్టింది.

అయితే.. బ్యాలెట్​ బాక్సులు విమానాల్లో సాధారణ ప్రయాణికుడి వలె ప్రయాణించనున్నాయి. దీని కోసం ప్రత్యేక టికెట్​ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 'మిస్టర్​ బ్యాలెట్​ బాక్స్' పేరుతో ఉండే పెట్టెల కోసం విమానాల్లో ముందువరుస సీటు కేటాయించారు ఈసీ అధికారులు. బ్యాలెట్​ పేపర్లు, పెన్నులు వంటి ఇతర సామగ్రిని తీసుకెళ్లే రవాణా అధికారి పక్క సీటును బ్యాలెట్​ బాక్స్​ కోసం ఖాళీగా ఉంచారు.

దిల్లీ నుంచి చండీగఢ్​కు మిస్టర్​ బ్యాలెట్​ బాక్స్​ పేరుతో విమాన టికెట్​

మంగళవారం 14 బ్యాలెట్​ బాక్సులను ఈసీ ఇప్పటికే పంపింది. బుధవారం మరో 16 తరలించనుంది. పార్లమెంట్​ హౌస్​, దిల్లీ లెజిస్లేటివ్​ అసెంబ్లీకి కూడా బుధవారమే పంపనుంది. హిమాచల్​ ప్రదేశ్​కు మాత్రం రోడ్డు మార్గంలో బ్యాలెట్​ బాక్స్​ను తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పుదుచ్చేరి బ్యాలెట్​ బాక్స్​తో ఈసీ అధికారులు
బ్యాలెట్​ బాక్స్​ల కోసం ఈసీ ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు
  • ఎన్నికల సామగ్రి తీసుకునేందుకు.. ప్రతి రాష్ట్రం నుంచి అసిస్టెంట్​ రిటర్నింగ్​ అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి ఓ అధికారి.. దిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయం నిర్వాచన్​ సదన్​కు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లిన రోజే తిరిగి ఆ రాష్ట్ర రాజధానికి చేరాల్సి ఉంటుంది.
  • బ్యాలెట్​ బాక్స్​లు, బ్యాలెట్​ పత్రాలు రాష్ట్ర రాజధానికి చేరాక.. అప్పటికే శానిటైజ్​, సీల్​ చేసి ఉంచిన స్ట్రాంగ్​ రూంలో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది.
  • పోలింగ్​ ముగిసిన వెంటనే.. పోలైన, సీలైన బ్యాలెట్​ బాక్స్​లు, ఇతర ఎన్నికల సామగ్రి.. రిటర్నింగ్​ అధికారి కార్యాలయానికి పంపిణీ చేయాలి. ఈసారి రిటర్నింగ్​ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్​ కార్యాలయానికి.. ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఫ్లైట్​లో చేరుకోవాల్సి ఉంటుంది.

ఎలక్టోరల్‌ కాలేజీ పద్ధతిలో ఎన్నిక ఇలా..రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు.

ఓటింగ్‌..రహస్య బ్యాలట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ చేయాల్సిన పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీఏ బలం కొంత ఎక్కువగానే ఉంది.

ఇవీ చూడండి:'ద్రౌపది గెలిచే అవకాశం'.. మమత జోస్యం.. దీదీపై కాంగ్రెస్​ ఫైర్

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details