తెలంగాణ

telangana

Prashant Kishor on One Nation One Election : ''ఒకే దేశం- ఒకే ఎన్నిక'తో జరిగేది అదే'.. ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ విశ్లేషణ ఇదీ..

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 6:44 PM IST

Updated : Sep 4, 2023, 7:43 PM IST

Prashant Kishor on One Nation One Election : భారత దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ.. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఉద్దేశాలతో సంస్కరణలు చేపడితే.. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'తో దేశానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

prashant-kishor-on-one-nation-one-election-if-done-with-correct-intentions-then-its-in-interest-of-country-says-prashant-kishor
ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు

Prashant Kishor on One Nation One Election : సదుద్దేశంతో సంస్కరణలు చేపడితే.. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' విధానంతో దేశానికి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు రాజకీయ విశ్లేషకుడు, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్. 2024లో సార్వత్రిక సమరం జరగాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తోందన్న ఊహాగానాల మధ్య బిహార్​లోని ముజఫర్​పుర్​లో ఈ వ్యాఖ్యలు చేశారు పీకే.

"సరైన ఉద్దేశాలతో, 4-5 సంవత్సరాల కాలవ్యవధితో ఆ పని(జమిలి ఎన్నికల సంస్కరణలు) చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రభావం 17-18 ఏళ్లపాటు ఉంటుంది. విశాలమైన భారత దేశంలో ప్రస్తుతం ఏటా 25శాతం జనాభా ఏదో ఒకరకంగా ఎన్నికల్లో పాల్గొంటుంది. కాబట్టి.. ప్రభుత్వాన్ని నడపాల్సిన వారు ఈ ఎన్నికల చక్రంలోనే తీరిక లేకుండా ఉంటున్నారు. ఇది(ఎన్నికలను) 1-2సార్లకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఖర్చులు తగ్గుతాయి. ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది." అని వివరించారు ప్రశాంత్ కిశోర్.

అలా చేస్తే ఇబ్బందులే..
అయితే.. జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం హడావుడిగా సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పీకే. "రాత్రికి రాత్రే ఎన్నికల పద్ధతిని మార్చాలని యత్నిస్తే సమస్యలు వస్తాయి. ప్రభుత్వం ఇందుకోసం బిల్లు తెస్తున్నట్టుంది. ఆ బిల్లు వచ్చాక చూద్దాం. ప్రభుత్వానికి సదుద్దేశాలు ఉంటే.. ఎన్నికల విధానంలో మార్పు రావాలి. అప్పుడు దేశానికి మంచి జరుగుతుంది. అయితే.. ఇదంతా ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో బిల్లు తెస్తుందనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది." అని అన్నారు ప్రశాంత్ కిశోర్.

ముమ్మర కసరత్తు..
జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఎన్​డీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తోంది. అనూహ్యంగా ఇటీవల ఈ వ్యవహారంపై కార్యాచరణ ప్రారంభించింది. లోక్​సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణకు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేతృత్వంలో కమిటీఏర్పాటు చేసింది. కోవింద్ కమిటీ నివేదికపై చర్చించి, జమిలి ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అదే సమయంలో.. సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానానికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందన్న చర్చకు ఆస్కారమిచ్చింది.

One Nation One Election : 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' చిక్కులివే!.. నిర్వహణ సాధ్యమేనా?

Prathidwani : దేశంలో జమిలి ఎన్నికలు..! లాభమెవరికి..? నష్టమెవరికి..?

Last Updated : Sep 4, 2023, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details