తెలంగాణ

telangana

ఇరాన్ కొత్త అధ్యక్షునికి మోదీ శుభాకాంక్షలు

By

Published : Jun 20, 2021, 2:41 PM IST

ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇరాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు.

modi iran
మోదీ ఇరాన్

ఇరాన్ నూతన అధ్యక్షనిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్న మోదీ.. భారత్​-ఇరాన్​ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలసి నడుద్దామని పిలుపునిచ్చారు.

"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం రైసీకి అభినందనలు. భారత్, ఇరాన్​ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా."

-ట్విట్టర్​లో మోదీ

ఇబ్రహీం రైసీ.. నాయమూర్తి పదవి నుంచి దేశ అత్యున్నత పదవి చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. ఇరాన్ చరిత్రలోనే ఈ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details