తెలంగాణ

telangana

జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు

By

Published : Nov 14, 2020, 11:55 AM IST

Updated : Nov 14, 2020, 2:46 PM IST

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా భారతీయులందరి తరఫున పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

PM Modi celebrates Diwali with soldiers in Jaisalmer
జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోదీ

జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరవాణె కూడా పాల్గొన్నారు.

"సైనికుల ముందుకు భారతీయులందరి శుభాకాంక్షలు తీసుకొచ్చా. వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తున్నా. మంచు కొండలు, ఎడారిలో నివసిస్తున్న సైనికులతో దీపావళి జరుపుకొంటున్నా. సైనికుల మధ్యకు వచ్చినప్పుడే నాకు నిజమైన దీపావళి. సైనికులు ఉత్సాహంగా ఉంటేనే మేము రెట్టింపు సంతోషంతో ఉంటాం. సైనికులు సంతోషంగా ఉంటేనే దేశమైనా, పండగైనా. దేశాన్ని ధైర్యంగా రక్షించే సైనికుల పట్ల భారతదేశం గర్విస్తోంది. ఆక్రమణదారులు, చొరబాటుదారులను ఎదుర్కొనే ధైర్యం మన సైనికులకు ఉంది.సైనికుల బలం, ధైర్యం చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు".

-- ప్రధాని నరేంద్ర మోదీ.

లాంగేవాలాను కాపాడుకున్నాం...

జైసల్మేర్​ వేదికగా చైనా, పాకిస్థాన్​కు గట్టి హెచ్చరికలు పంపారు మోదీ. భారత్​ సహనాన్ని పరీక్షించాలని చూస్తే గట్టి జవాబు తప్పదని స్పష్టం చేశారు.

"భారతదేశానికి అనేక దేశాలతో సుదీర్ఘ సరిహద్దులు ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తెలిసిన సరిహద్దు ఒకటుంది.. అదే లాంగేవాలా పోస్టు. పాక్‌సైనికుల నుంచి లాంగేవాలా సరిహద్దును కాపాడుకున్నాం. భారత్​ తన వ్యూహాలపై స్పష్టంగా ఉంది. ఇతరులను గౌరవిస్తూ, గౌరవంగా ఉండటమే భారత్​ విధివిధానం. అయితే ఎవరైనా మన సహనాన్ని పరీక్షించాలని చూస్తే వారికి గట్టి జవాబిస్తాం".

-- ప్రధాని మోదీ

రక్షణపై మరింత దృష్టి...

భారత్​ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు మోదీ. రక్షణ రంగాన్ని 'ఆత్మనిర్భర్​'గా చేయడానికి కృషి జరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో సొంతంగా ఆయుధాల కర్మాగారం నెలకొల్పడంపైనా దృష్టి పెట్టినట్లు మోదీ స్పష్టం చేశారు.

Last Updated : Nov 14, 2020, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details