తెలంగాణ

telangana

చైనా దురాక్రమణపై విపక్షాల ఉమ్మడి పోరు.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ప్లాన్!

By

Published : Dec 14, 2022, 7:52 PM IST

భారత్ సరిహద్దులో చైనా దురాక్రమణ విషయంలో కేంద్రంపై సమష్టిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో 17 పార్టీలకు చెందిన నేతలు భేటీ అయి.. ఈ మేరకు చర్చలు జరిపాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

opposition parties meeting
చైనా భారత్ సరిహద్దు వివాదం

సరిహద్దుల్లో చైనా దురాక్రమణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సమష్టిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో పార్లమెంటులోని కాంప్లెక్స్‌లో భేటీ అయిన.. 17 పార్టీలకు చెందిన నేతలు.. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు.

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్ చేసిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని.. దీనిపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మెుత్తం 17 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరుకాగా టీఎంసీ గైర్హాజరైంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదని పేర్కొన్న ఆ పార్టీ.. విపక్షాలన్నీ కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. చైనా విషయంలో ఉమ్మడి ప్రకటన చేయాలని నిర్ణయించిన విపక్షాలు.. సైన్యాన్ని ఎక్కడా తక్కువ చేయకూడదని నిర్ణయించాయి. గురువారం మరోసారి అన్ని పార్టీలు పార్లమెంట్‌లో సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details