తెలంగాణ

telangana

Omicron community spread: 'దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్'

By

Published : Jan 23, 2022, 7:25 AM IST

Omicron community spread India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం తెలిపింది. విదేశీ ప్రయాణికుల నుంచి కంటే దేశీయంగానే ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాపిస్తోందని వెల్లడించింది.

Omicron community transmission India
Omicron community transmission India

Omicron community transmission India: సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ వేరియంట్‌ అయిన ఒమిక్రాన్‌ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్‌) తెలిపింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్‌ ప్రబలంగా ఉందని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది.

Community spread omicron

"వ్యాక్సిన్‌ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్‌ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్‌ లక్షణాలు బహిర్గతం కావడంలేదు(అసింప్టమాటిక్‌). మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, టీకా తీసుకోని హైరిస్కు ఉన్న వ్యక్తుల్లోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం సరికాదు" అని ఇన్ఫాకాగ్‌ హెచ్చరించింది.

వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగ దని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Corona thrid wave: కరోనా మృతుల్లో 60% మంది వారే!

ABOUT THE AUTHOR

...view details