తెలంగాణ

telangana

76 వెడ్స్​ 46.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆలయంలో పెళ్లి

By

Published : Jul 25, 2023, 7:59 AM IST

Old Couple Love Marriage : 76 ఏళ్ల వృద్ధుడికి లేటు వయసులో ప్రేమ చిగురించింది. ఎనిమిదేళ్ల పాటు ప్రేమిస్తున్న 46 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. లేటు వయుసులో తొలి చూపులోనే ప్రేమలో పడ్డ ఈ జంట కథేంటో ఓ సారి తెలుసుకుందాం.

Old Couple Love Marriage
Old Couple Love Marriage

76 వెడ్స్​ 46.. ముందు కోర్టులో.. తర్వాత గుడిలో పెళ్లి

Old Couple Love Marriage : ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఏ వయసులోనైనా ప్రేమ కలగవచ్చని చెబుతుంటారు. ఇలాగే.. లేటు వయసులోనే ఓ 76 ఏళ్ల వృద్ధుడికి ప్రేమ పుట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించి ఓ 46 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ లేటు వయుసు పెళ్లి కథ ఏంటో ఓ సారి తెలుసుకుందామా మరి.

ఇదీ జరిగింది..
ఒడిశా.. గంజాం జిల్లాలోని సంఖెముండి మండలం అడ్డాడ గ్రామంలో రామచంద్ర సాహు అనే 76 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. అతడికి చాలా ఏళ్ల క్రితం పెళ్లైంది. తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహం చేశాడు. ఒక కుమార్తె అత్తవారంట్లో ఉండగా.. మరో కుమార్తె చనిపోయింది. అంతకుముందే తన భార్య చనిపోయింది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు రామచంద్ర. దీంతో అతడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ ప్రాంతంలోని కులగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖ (46)ను చూశాడు. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రామచంద్ర.. వివాహ ప్రతిపాదనకు సురేఖ కూడా అంగీకరించింది. దీంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఫోన్​లో మాట్లాడుకున్నారు. చివరకు జులైన 19న భంజ్​నగర్​ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గుడిలో ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు.

పెళ్లి చేసుకుంటున్న జంట

28 ఏళ్ల యువతిని పెళ్లాడిన వృద్ధుడు..
ఇలాంటి ఘటనే మే నెలలో జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​.. భదోహి జిల్లాలోని బీహరోజ్​పుర్​కు చెందిన రామ్​ యాదవ్​(60), దాదాపు తన వయసులో సగం వయసు ఉన్న అషర్ఫీ దేవి(28)ని ప్రేమించాడు. అయితే అషర్ఫీ దేవికి 2008లోనే కృష్ణ మూరత్ యాదవ్​తో వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణ మూరత్.. కుటుంబ పోషణ కోసం తమిళనాడులో పని చేస్తున్నాడు. ఇటీవల అతడు తమిళనాడు నుంచి భదోహికి తిరిగి వచ్చాడు. అప్పటికే అషర్ఫీ దేవి.. రామ్ యాదవ్​తో పారిపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదని కృష్ణ మూరత్​.. కోయిరౌనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి రామ్ యాదవ్​, అషర్ఫీ దేవిని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details