తెలంగాణ

telangana

'సిగ్నలింగ్ వైఫల్యం వల్లే ఒడిశా ప్రమాదం.. 'కవచ్‌' ఉంటే ఘటన జరిగేదే కాదు!'

By

Published : Jun 3, 2023, 1:33 PM IST

Updated : Jun 3, 2023, 3:46 PM IST

Odisha Train Accident : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధరించింది. లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టిందని రైల్వే శాఖ వెల్లడించింది. మెయిన్‌ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇచ్చారని.. అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్​లైన్​లోకి వెళ్లిందని పేర్కొంది. అందువల్లే ఘోర ప్రమాదం జరిగిందని తెలిపింది.

odisha train accident
odisha train accident

Odisha Train Accident : సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. లూప్​లైన్​లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టిందని తెలిపింది. మెయిన్‌ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్‌ ఇచ్చారని.. అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్​లైన్​లోకి వెళ్లిందని వెల్లడించింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపింది.

ప్రమాద స్థలంలో సహాయక సిబ్బంది, స్థానికులు

రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత 'కవచ్‌'.. ప్రమాదం జరిగిన మార్గంలో అందుబాటులో లేకపోవడం వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. కవచ్‌ అందుబాటులో ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని, లేదా నష్టం తప్పేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో కవచ్‌ వ్యవస్థ అందుబాటులో లేదని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది

రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత 'కవచ్‌'.. ప్రమాదం జరిగిన మార్గంలో అందుబాటులో లేకపోవడం వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. కవచ్‌ అందుబాటులో ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని, లేదా నష్టం తప్పేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో కవచ్‌ వ్యవస్థ అందుబాటులో లేదని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

ప్రమాద స్థలంలో సహాయక సిబ్బంది, స్థానికులు

Kavach Indian Railways : స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ కవచ్‌. కవచ్ వ్యవస్థ రైళ్లు ఎదురుగా లేదా వెనుక నుంచి ఢీకొనకుండా చూస్తుంది. రైళ్లు సమీపానికి వచ్చినప్పుడు కవచ్‌ ఆ రైళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే ఈ కవచ్‌ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కవచ్‌ వ్యవస్థ గుర్తించి ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.

కవచ్‌ వ్యవస్థతో రైల్వే ఇంజిన్‌లోని క్యాబ్‌లో అమర్చిన స్క్రీన్‌పై ప్రతి సిగ్నల్ కనిపిస్తుంది. రైలు ఎంత వేగంగా కదులుతుందో లోకో పైలట్లు తమ స్క్రీన్‌పై చూడవచ్చు. దట్టమైన పొగమంచు, వర్షం, క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో రైళ్ల వేగం నెమ్మదిస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట కవచ్‌.. రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు మించకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్‌ చేస్తుంది. కవచ్‌ సాంకేతికతతో 10వేల ఏళ్లలో ఒక తప్పిదం మాత్రమే జరిగే అవకాశముందని, సున్నా ప్రమాదాలే లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో ప్రకటించారు. కవచ్ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు 2021-22 ఏడాది రూ.133 కోట్లు, 2022-2023లో రూ.272.30 కోట్లు విడుదలయ్యాయి.

ప్రమాదం జరిగింది ఇలా..
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.

సహాయక చర్యలు చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది

ఇవీ చదవండి :ఒడిశా ఘోర ప్రమాదంపై ప్రధాని సమీక్ష.. ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ

'ఒకేసారి రెండు రైళ్లకు సిగ్నల్​.. అందుకే ప్రమాదం'.. చెల్లాచెదురుగా మృతదేహాలు

Last Updated :Jun 3, 2023, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details