తెలంగాణ

telangana

క్షుద్రపూజల నిందవేసి.. మలం తినిపించి...

By

Published : Jun 30, 2021, 2:54 PM IST

Updated : Jun 30, 2021, 7:42 PM IST

ఆధునికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. మనిషి మూఢ నమ్మకాలను వీడనట్లేదనడానికి నిదర్శనమే ఈ ఘటన. క్షుద్రపూజలు చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా కొట్టడమే గాక.. మలం తినిపించిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది.

black magic attack
మంత్రాల నెపంతో ముగ్గురు వ్యక్తులపై గ్రామస్థుల అరాచకం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తున్నప్పటికీ.. మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలు పోవడం లేదు. ఒడిశా గంజాం జిల్లా చామఖండి తాలూకా రామయపల్లి గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కనికరం లేకుండా కొట్టారు గ్రామస్థులు. అంతటితో ఆగక.. గ్రామస్థులంతా కలసి వారితో మలం తినిపించారు.

ఒడిశా గంజాం జిల్లాలో క్షుద్రపూజల అనుమానంతో వ్యక్తిని కొడుతున్న గ్రామస్థులు
విచక్షణా రహితంగా కొడుతున్న ఊరిజనం
క్షుద్రపూజల నెపంతో దాడి

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ పాశవిక ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Last Updated : Jun 30, 2021, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details