తెలంగాణ

telangana

'రొమ్ము క్యాన్సర్​కు మందు.. నాలుగో దశలోనూ నయం.. భారత శాస్త్రవేత్త ప్రతిభ!'

By

Published : Jun 28, 2022, 1:19 PM IST

ఒడిశా భువనేశ్వర్​కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్​ సందీప్​ కుమార్​ మిశ్రా రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టారు. ఈ ఔషధం క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న రోగులకు ఇచ్చినా చక్కటి పనితీరును కనబరిచిందని డాక్టర్​ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

odisha scientist find breat cancer medicine
odisha scientist find breat cancer medicine

రొమ్ముక్యాన్సర్.. ప్రస్తుతం మహిళలను భయపెడుతున్న వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలోనే ఒడిశా భువనేశ్వర్​కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్​ సందీప్​ కుమార్​ మిశ్రా రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టారు. ఈ ఔషధం క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న రోగులకు ఇచ్చినా చక్కటి పనితీరును కనబరిచిందని ఆయన తెలిపారు.

రొమ్ము క్యాన్సర్​ నయం అయ్యే మందు కోసం పరిశోధనలు చేసిన మిశ్రా.. 'అర్టెమిసినిన్​' అనే ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇది రోగుల్లో క్యాన్సర్​ కణాలు పెరగకుండా కట్టడి చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన భువనేశ్వర్​లోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లైఫ్​ సైన్సెస్​ క్యాన్సర్​ డిపార్ట్​మెంట్​లో మాలిక్యూలర్​ ఆంకాలజీ హెడ్​గా పనిచేస్తున్నారు.

శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ కుమార్ మిశ్రా

"రొమ్ము క్యాన్సర్​కు మందును కనిపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇది క్యాన్సర్​ నాలుగో దశలో ఉన్న వారికి ఇచ్చినా చక్కటి పనితీరు కనబరిచింది. ఈ పరిశోధనలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక శాస్త్రవేత్తగా సమాజానికి నా వంతు సహాయం చేయడం నా విధి."

-సందీప్​ కమార్ మిశ్రా, శాస్త్రవేత్త

సందీప్​ కుమార్ మిశ్రా కనుగొన్న విషయాలు నేచర్​ గ్రూప్​ ఆఫ్ జర్నల్స్​కు చెందిన బ్రిటీష్​ జర్నల్ ఆఫ్​ క్యాన్సర్​లో ప్రచురితమయ్యాయి. ఈ ఔషధం రొమ్ము క్యాన్సర్​తో బాధ పడుతున్న మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మిశ్రా తెలిపారు. తాను చేసిన ఈ పరిశోధన బీఎంసీ క్యాన్సర్​ ఇంటర్​నేషనల్​ జర్నల్​ సైతం ఆమోదించిందని అనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని.. ​ఎయిమ్స్ భువనేశ్వర్​, కేఐఐటీ సంయుక్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ పరిశోధనలో తనకు సహకరించిన వారందరికీ డాక్టర్ సందీప్​ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు అనేక అంతర్జాతీయ వేదికలపై తన పరిశోధనలపై ప్రసంగించినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:స్కానింగ్​లో ఇద్దరు.. డెలివరీలో నలుగురు.. డాక్టర్లు షాక్​!

ABOUT THE AUTHOR

...view details